ఎలాంటి బ్యాగ్రౌండ్ సపోర్ట్ లేకుండా సినీరంగంలోకి అడుగుపెట్టి ఓ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు హీరో విజయ్ దేవరకొండ. మొదట్లో సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు పోషించిన విజయ్.. ఆ తర్వాత పెళ్లి చూపులు సినిమాతో హీరోగా వెండితెరకు పరిచయంకాగా.. డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా రూపొందించిన అర్జున్ రెడ్డి సినిమాతో హీరోగా కెరీర్ ఒక్కసారిగా మలుపు తిరిగింది. ఆ వెంటనే గీతా గోవిందం, డియర్ కామ్రేడ్ వంటి చిత్రాలతో మెప్పించిన విజయ్.. ఇటీవలే ఫ్యామిలీ స్టార్ మూవీతో మరోసారి అడియన్స్ ముందుకు వచ్చారు. మృణాల్ ఠాకూర్ నటించిన ఈ మూవీ పర్వాలేదనిపించగా.. ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తోన్న కల్కి 2898 ఏడి చిత్రంలో అర్జునుడి పాత్రలో కనిపించాడు. కొన్ని రోజులుగా చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్న విజయ్.. ఇటు రియాల్టీ షోలలోనూ పాల్గొంటున్నాడు. ఇటీవలే ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న ఇండియన్ ఐడల్ సీజన్3లో సందడి చేశాడు.

ఓ వైపు సినిమాలతో బిజీగా ఉన్న విజయ్… బయట పలు సేవ కార్యక్రమాలు చేయడానికి ముందుంటాడు. తన ఫౌండేషన్ ద్వారా ఇప్పటికే ఎంతో మందికి సాయం చేశాడు. అలాగే కరోనా లాక్ డౌన్ సమయంలో మిడిల్ క్లాస్ ఫండ్స్ అని ఓ ఫౌండేషన్ స్టార్ట్ చేసి తన డబ్బుతోపాటు విరాళాలు సేకరించి ఎంతో మంది పేదలకు నిత్యావసరాలు అందించారు. తాజాగా విజయ్ గురించి ఓ విషయం బయటకు వచ్చింది. ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3లో ఓ ఎపిసోడ్ గెస్ట్ గా పాల్గొన్నారు విజయ్. అయితే ఆ స్టేజ్ పై ఓ ట్రాన్స్ జెండర్ విజయ్ చేసిన సాయం గురించి చెప్తూ ఎమోషనల్ అయ్యింది.

బెగ్గింగ్ తప్ప ఎలాంటి ఆధారంలేని తనకు.. లాక్ డౌన్ సమయంలో ఇళ్లు గడవలేదని.. అలాంటి సమయంలోనే సోషల్ మీడియాలో విజయ్ ఫౌండేషన్ కు అప్లై చేయగా.. 16 నిమిషాల్లోనే తనకు కాల్ చేసి సాయం చేశారని తెలిపింది. కేవలం తనకు మాత్రమే కాకుండా తన కమ్యూనిటీలో దాదాపు 18 మందికి, తన ఫ్యామిలీకి సాయం చేశారని.. విజయ్ దేవరకొండను ఎప్పటినుంచో కలుద్దామనుకున్నానని .. ఎట్టకేలకు ఇప్పుడు కుదిరిందని చెప్పుకొచ్చింది. విజయ్ దేవరకొండ కనిపించే దేవుడు అంటూ ఎమోషనల్ అయ్యింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరలవుతుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.