సినీ పరిశ్రమలోనే అతడు రిచెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్. సౌత్ నుంచి నార్త్ వరకు ఎన్నో సినిమాలకు అద్భుతమైన సంగీతాన్ని అందించారు. మనసుకు హత్తుకునే మెలోడీ మ్యూజిక్‏తో శ్రోతల హృదయాలను గెలుచుకున్నారు. ఎన్నో పాటలకు తన అందమైన సంగీతంతో ప్రాణం పోశారు. నిజమే.. అతడి మ్యూజిక్‏కు ప్రత్యేకమైన ఆకర్షణ ఉంది. తరాలు మారినా ఆ మ్యూజిక్ డైరెక్టర్ కంపోజ్ చేసే పాటలకు ఆదరణ ఏమాత్రం తగ్గలేదు. తెలుగు, హిందీ, తమిళం భాషలలో వందలాది చిత్రాలకు సంగీతం అందించిచ సంగీత ప్రపంచంలో తనదైన ముద్ర వేశాడు. తొలి సినిమాతోనే ఉత్తమ సంగీత దర్శకుడిగా జాతీయ అవార్డ్ అందుకున్నారు. ఇంతకీ అతడు ఎవరో తెలుసా.. మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్. తొమ్మిదేళ్ల వయసులోనే కుటుంబ బాధ్యతను తీసుకున్న రెహమాన్… ఇప్పుడు సినీ పరిశ్రమలో మాస్టర్ ఆఫ్ మెలోడిగా మారాడు.

కెరీర్ తొలినాళ్లలో కీబోర్డ్ ప్లేయర్ గా ఇళయరాజా, రమేశ్ నాయుడు, రాజ్ కోటిల వద్ద పనిచేసిన రెహమాన్.. 1992లో రోజా సినిమాతో సంగీత దర్శకుడిగా మారాడు. ఆ తర్వాత డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వం వహించిన చాలా సినిమాలకు సంగీతం అందించాడు. వీరిద్దరి కాంబోలో వచ్చిన మూవీస్ అన్ని మ్యూజికల్ బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలిచాయి. రోజా సినిమాకు రూ. 25,000 పారితోషికం తీసుకున్న రెహమాన్ ఇప్పుడు ఒక్కో సినిమాకు రూ.10 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడు. ప్రస్తుతం రెహమాన్ ఆస్తి రూ.1748 కోట్లు. ఒక్క లైవ్ పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి రూ.2 కోట్ల వరకు తీసుకుంటారు.

ప్రస్తుతం ఇండియన్ సినీ పరిశ్రమలో రెహమాన్ అత్యధిక ఆస్తి ఉన్న మ్యూజిక్ డైరెక్టర్. 90’s లో రెహమాన్ హావా ఎక్కువగా ఉండేది. ఇప్పటివరకు రెండు ఆస్కార్ అవార్డ్స్, రెండు గ్రామీ అవార్డ్స్, బీఎఎప్టీఎ అవార్డ్, గోల్డెన్ గ్లోబ్ అఏవార్డ్, నాలుగు జాతీయ చలనచిత్ర పురస్కారాలు, పదిహేను ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్, పదమూడు ఫిల్మ్ ఫేర్ సౌత్ అవార్డ్స్ గెలుచుకున్నాడు. అలాగే రెహమాన్ ఖాతాలో ఎన్నో అరుదైన రికార్డ్స్ చేరాయి.

 

View this post on Instagram

 

A post shared by ARR (@arrahman)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.