రెబెల్ స్టార్ ప్రభాస్ (Rebel star Prabhas) కల్కి (Kalki 2898AD) సినిమా మరో హిస్టారిక్ రికార్డ్ ను దక్కించుకుంది. ఈ సినిమా 1000 కోట్ల రూపాయల మార్క్ ను అందుకుంది. కేవలం 14 రోజుల్లో బాక్సాఫీస్ వద్ద వరల్డ్ వైడ్ గా 1002 కోట్ల రూపాయలు రాబట్టింది. మన దేశంలో వెయ్యి కోట్లు ఆర్జించిన అతి కొద్ది సినిమాల్లో ఒకటిగా రికార్డ్ క్రియేట్ చేసింది కల్కి.

ప్రభాస్ కు బాహుబలి 2 తర్వాత మళ్లీ ఆ ఘనత దక్కించిన చిత్రంగా కల్కి నిలిచింది. ఓవర్సీస్ లో 17 మిలియన్ డాలర్స్ వసూళ్లు అందుకున్న కల్కి బాలీవుడ్(Bollywood)లో 300 కోట్ల రూపాయల వసూళ్లు అందుకుంది. ఈ సినిమాకు తెలుగు రాష్ట్రాల్లోనూ రికార్డ్ స్థాయి వసూళ్లు దక్కాయి. కల్కి వెయ్యి కోట్ల రూపాయల వసూళ్లపై అమితాబ్ బచ్చన్ తన సంతోషాన్ని వ్యక్తం చేశారు.