రాజ్ తరుణ్ (Raj tarun) ప్రేయసి లావణ్య (Lavanya) నిన్న రాత్రి ఆత్మహత్య యత్నం (Suicide attempt) చేయడం సంచలనం సృష్టించింది. నిన్న రాత్రి తాను చనిపోతున్నట్లు మేసేజ్ రాసి దాన్ని తన లాయర్ కు పంపించింది లావణ్య. ఆయన వెంటనే 112 నెంబర్ కు కాల్ చేసి నార్సింగి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు అర్థరాత్రి లావణ్య ఇంటికి వెళ్లి ఆమెకు కౌన్సెలింగ్ ఇచ్చారు. ఆత్మహత్య ప్రయత్నాన్ని విరమించుకునేలా ఒప్పించారు.

లావణ్య ఆత్మహత్య ప్రయత్నం విషయం మీడియాలో వైరల్ అవుతోంది. రాజ్ తరుణ్ లేకుండా తాను బతకలేనని, అతను మాత్రం తన చావును కోరుకున్నాడని సూసైడ్ లెటర్ లో లావణ్య రాసింది. రాజ్ తల్లిదండ్రులు, మాల్వీ మల్హోత్రా తన చావుకు కారణమని లేఖలో పేర్కొంది. లావణ్య సూసైడ్ అటెంప్ట్ తో హీరోయిన్ మాల్వీ మల్వోత్రా (Malvi malhotra)తో పాటు రాజ్ తరుణ్ కు మరిన్ని ఇబ్బందులు ఎదురుకాబోతున్నాయి.