మెగాస్టార్ చిరంజీవి (Megastar chiranjeevi) విశ్వంభర (Vishwambhara) సినిమా శరవేగంగా కంప్లీట్ అవుతోంది. ఈ సినిమా ఇటీవలే డబ్బింగ్ కార్యక్రమాలు ప్రారంభించుకోగా..ఇప్పుడు మ్యూజిక్ సిట్టింగ్స్ మొదలుపెట్టారు. వచ్చే సంక్రాంతికి జనవరి 10న కంఫర్ట్ గా మూవీ రిలీజ్ చేసేందుకు దర్శకుడు వశిష్ఠ (Vasista) పక్కా ప్లానింగ్ చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే టాకీ పార్ట్ అనుకున్న షెడ్యూల్స్ లోనే కంప్లీట్ చేశారు. నెల రోజుల పాటు భారీ యాక్షన్ సీక్వెన్స్ తెరకెక్కించారు. ఇప్పుడు మ్యూజిక్ సిట్టింగ్స్ తో పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ఒక కొలిక్కి రానుంది.

కీరవాణి (MM keeravani), మెగాస్టార్ కాంబోలో గతంలో ఆపద్భాంధవుడు అనే సినిమా వచ్చింది. ఇది మ్యూజికల్ హిట్. అలాంటి మ్యూజికల్ బ్లాక్ బస్టర్ ఇస్తున్నామనే అభిప్రాయం ఇటీవల మెగాస్టార్ వ్యక్తం చేశారు. విశ్వంభర మ్యూజిక్ సిట్టింగ్స్ కోసం కీరవాణి, డైెరెక్టర్ వశిష్ఠ, సింగర్స్ లిప్సిక, రాహుల్ సిప్లిగంజ్, లిరిసిస్ట్ రామజోగయ్య శాస్త్రి, మెగాస్టార్ చిరంజీవి బెంగళూరు వెళ్లారు. అక్కడ వీరు తీసుకున్న సెల్ఫీ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.