యంగ్ హీరోయిన్ మీనాక్షి చౌదరి (Meenakshi chowdary) వరుస అవకాశాలతో టాలీవుడ్ లో మూవీస్ చేస్తోంది. మీనాక్షి చేసిన కొన్ని సినిమాలు ఫ్లాప్ అయినా లక్కీగా ఆ ఎఫెక్ట్ ఆమె మీద పడటం లేదు. ప్రస్తుతం వెంకటేష్ (venkatesh), అనిల్ రావిపూడి కాంబో మూవీ చేస్తోంది మీనాక్షి. మరోవైపు మెగాస్టార్ విశ్వంభర (Vishwambhara) సినిమాలోనూ ఆమె కీ రోల్ లో కనిపించనుంది. మరికొన్ని ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్స్ తెలుగులో ఆమెకు దక్కుతున్నాయి.

ఇక ఈ జోరును మరింత పెంచుతూ కోలీవుడ్ లో లేడీ ఓరియెంటెడ్ మూవీ చేయబోతోంది మీనాక్షి చౌదరి. దర్శకుడు ప్రేమ్ ఆనంద్ రూపొందించి డీడీ రిటర్న్స్ సినిమా మంచి హిట్ అయ్యింది. ఇప్పుడీ మూవీకి సీక్వెల్ చేస్తున్నారు. డీడీ రిటర్న్స్ 2 (DD returns 2) పేరుతో రూపొందే ఈ సినిమాలో మీనాక్షి చౌదరి లీడ్ రోల్ లో కనింపించనుంది. లేడీ ఓరియెంటెడ్ సినిమా చేయడం ఈ భామ కెరీర్ లో మరో స్టెప్ లాంటిదే అనుకోవచ్చు.