ఈ రోజు బ్రహ్మముడి ఎపిసోడ్‌లో.. అపర్ణ మనసు మార్చడానికి కావ్య ప్రయత్నిస్తుంది. కానీ అపర్ణ మాట వినిపించుకోదు. దీంతో కావ్యపై సీరియస్ అవుతుంది అపర్ణ. కాస్త చనువు ఇస్తే నన్నే నిలదీస్తున్నావ్? అసలు సమస్య ఏంటో నీకు తెలీదు. అసలు సమస్య ఏంటో నీకు తెలీదు. నా కాపురానికి సంబంధించింది. నా భర్త మీద నేను పెట్టుకున్న నమ్మకానికి సంబంధించింది. అదంతా ఒక తప్పుతో పోగొట్టుకున్నాడు ఆ పెద్ద మనిషి. ఆ తప్పును నువ్వు సమర్దిస్తావా? అని అపర్ణ అడిగితే.. అయ్యో నేను ఎక్కడ సమర్థించాను అని కావ్య అంటుంది. సమస్య నువ్వు అనుకున్నంత చిన్నది కాదు కావ్య.. అది నా ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసింది. తాళి కట్టిన భర్త మోసం చేస్తే ఎప్పటికీ మర్చిపోలేరు. ఇది నాకు సంబంధించింది.. నేనే తేల్చుకుంటాను. అది నాకు వదిలేయ్ అని అపర్ణ అంటే.. ఇప్పటి వరకూ మీరు వేసిన శిక్ష చాలదా? అని కావ్య అడుగుతుంది. ఇదే తప్పు నువ్వు రాజ్ చేస్తే ఊరుకుంటావా? అని అపర్ణ ప్రశ్న వేస్తుంది.

పంతంలో అపర్ణ..

అంటే అది ఆయన బిడ్డ తీసుకొచ్చినా నేను దూరం పెట్టలేదు కదా అని కావ్య అంటుంది. ఎందుకంటే వాడు తప్పు చేసే మనిషి కాదని నువ్వు నమ్మావు కాబట్టి.. ఒక వేళ వాడు తప్పు చేసి ఉంటే.. ఇంట్లోంచి వెళ్లిపోతాను అన్నావా లేదా? అది తప్పు అని నువ్వే రుజువు చేశావా లేదా అని అపర్ణ అడుగుతుంది. అందుకు కావ్య అవును అని సమాధానం చెబుతుంది. మరి ఇంకెందుకు? ఆయన తరుపున నువ్వు మాట్లాడుతున్నావ్ వెళ్లమని అపర్ణ అంటుంది. అత్తయ్యా మీరు బావుండాలి అని మాత్రమే నేను కోరుకుంటున్నానని కావ్య అంటుంది. మీ ఆయన ఏమన్నా తక్కువా? అయినా నా కర్మకు ఎవర్నీ బాధ్యుల్ని చేయడం లేదు. ఎవరెన్ని తప్పులు చేసినా మీరు క్షమించారు కదా.. మరి మావయ్యని ఎందుకు క్షమించడం లేదని కావ్య అడుగుతుంది. అన్నీ వేరు ఇది వేరు కావ్య. నువ్వు ముసుగు వేసుకుని నా కొడుకుని పెళ్లి చేసుకున్నావ్ కదా.. అందరూ తప్పులు చేశారు. కానీ ఇది వేరు. ఇది నా మనసుకు సంబంధించింది. కాబట్టి నేను ఇలానే ఉంటానని అపర్ణ అంటుంది. కానీ ఇలా ఉండటం వల్ల మీరు మీకు మీరే శిక్ష వేస్తున్నారని కావ్య నచ్చజెప్పాలని చెప్పినా అపర్ణ వినదు.

కళ్యాణ్‌కు స్పప్న సలహా..

ఈ సీన్ కట్ చేస్తే.. కళ్యాణ్ అప్పూకి ఎన్ని సార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయదు. అప్పుడే స్వప్న వెళ్తుంటే.. ఒకసారి ఇలా అని కళ్యాణ్ పిలుస్తాడు. ఒక సారి నీ ఫోన్ ఇస్తావా? అని అడుగుతాడు కళ్యాణ్. నా మొగుడే నా ఫోన్ అడగటానికి భయ పడతాడు. నువ్వేంటి ఇలా అడుగేసావు కళ్యాణ్ అని స్వప్న అంటే.. అప్పూకి ఎన్ని సార్లు ఫోన్ చేసినా అస్సలు లిఫ్ట్ చేయడం లేదు. నీ ఫోన్ నుంచి చేస్తే తీస్తుందని అడిగానని కళ్యాణ్ అంటాడు. లిఫ్ట్ చేయడం లేదంటే నీతో మాట్లాడటం లేదనే కదా అర్థం. ఎందుకు సమస్యల్ని పెద్దది చేయాలని చూస్తున్నావ్. నా మాట విను. కొన్ని రోజులు మీరు మాట్లాడకుండా ఉంటేనే మంచిది. కావాలంటే కొన్ని రోజులు ఆఫీస్‌కి వెళ్లు. కొద్ది రోజుల్లో అంతా సెట్ అయిపోతుందని అంటుంది స్వప్న.

అప్పూ, కళ్యాణ్‌లు దూరంగానే ఉండాలి..

అప్పుడే రాహుల్ వచ్చి.. ఏంటి అలా మాట్లాడుతున్నావ్? స్వప్న.. మాట్లాడతానంటే సపోర్ట్ చేయకుండా.. మర్చిపో.. ఆఫీస్‌కి పో అంటున్నావ్ అని రాహుల్ అంటాడు. ఏం చేస్తే మంచిదో మాకు తెలుసు. నీ సలహాలు ఏమీ మాకు అవసరం లేదు ముందు వెళ్లు. కొద్ది రోజులు ఓపిక పట్టు కళ్యాణ్.. అని స్వప్న అంటుంది. అప్పుడే రాహుల్.. రుద్రాణికి ఎదురు పడతాడు. ఏంట్రా సలహాలు ఇస్తున్నావ్? ఏంటి అని రుద్రాణి అడిగితే.. రాహుల్ అంతా చెప్తాడు. రేయ్ ఆ కళ్యాణ్ అసలే ఇప్పుడు ఫ్రస్ట్రేషన్ లో ఉన్నాడు. ఇప్పుడు ఆ అప్పూకి దగ్గరై.. పెళ్లి చేసుకుంటానని చెప్పాడనుకో మన కొంపలు తగలబడతాయి. కావ్యని కాదని మనం ఏదైనా చేయగలుగుతున్నామా? కావ్య పైకి కనిపించే మిరపకాయ. కానీ ఆ అప్పూ ఆటమ్ బాంబ్. మొత్తం పేల్చి పడేస్తుంది. దాని స్పీడ్ తట్టుకోవడం మన వల్ల కాదు. కాబట్టి అది ఆ ఇంట్లోనే ఉండాలి. ఒకవేళ కళ్యాణ్ అప్పూని పెళ్లి చేసుకుంటాను అంటే.. ఏం చేస్తావ్ అని రాహుల్ అడుగుతాడు. దాని కోసం ధాన్య లక్ష్మిని ఎలా వాడుకుంటానో చూడు అని రుద్రాణి అంటుంది.

ఇక శోభనం జరిగినట్లే..

అపర్ణ, సుభాష్‌‌ల గురించి ఆలోచిస్తూ రాజ్, కావ్యలు బాధ పడతారు. వాళ్ల మధ్యకు మనం వెళ్లకుండా ఉండాలని అనుకుంటారు. రాజ్ ఏదో చెప్తాన్న విషయం గుర్తుకు తెచ్చుకుంటుంది. అవును అప్పుడు ఏదో చెప్తానన్నారు ఏంటి అని అడుగుతుంది. దీంతో రాజ్ సిగ్గుపడుతూ మెలికలు తిరిగిపోతూ ఉంటాడు. మధ్య మధ్యలో జోకులు వేస్తూ.. కావ్య బుగ్గలు గిల్లుతాడు రాజ్. నువ్వు కళ్లు మూసుకో అసలు విషయం చెప్తానని రాజ్ అంటాడు. కావ్య నవ్వుతూ కళ్లు మూసుకుంటుంది. రాజ్ ట్రయల్ వేస్తూ ఉండగా.. రాజ్ అంతరాత్మ బయటకు వస్తుంది. కావ్య వాష్ రూమ్‌కి వెళ్లింది చాలా సేపు అయింది. ఇంక నాకు శోభనం అయినట్లే అని అంతరాత్మ అంటుంది. సరే అని రాజ్ ప్రిపేర్ అవుతాడు. కావ్య బయటకు వస్తూ ఎంతో నీరసంగా ఉంటుంది. నెలకు వచ్చే ఒకసారి వచ్చే కష్టం వచ్చింది. ఆ విషయం తర్వాత చెప్పండి. పడుకుంటా అని కావ్య వెళ్లి పడుకుంటుంది. రేయ్ ఇంక అంతే.. నీకంటే అష్ట దరిద్రుడు ఎవరూ ఉండరు అని అంతరాత్మ తిడుతుంది.

అరెస్ట్ అయిన అప్పూ.. కంగారులో కవి..

ఆ తర్వాత అప్పూ, బంటీ బయటకు వెళ్లి సామన్లు తీసుకుంటూ ఇంటికి వెళ్తారు. అక్కడే ఉన్న ఓ ముగ్గురు.. అప్పూ, కళ్యాణ్‌ల గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. అయినా అప్పూ పట్టించుకోకుండా వెళ్తుంది. అక్కా వాళ్లు నీ గురించే మాట్లాడుకుంటున్నారని బంటీ అంటే.. రేయ్ ఇప్పటికే చాలా గొడవలు అవుతున్నాయి. ఇప్పుడు వీళ్లను కొట్టి.. అమ్మకి తెలిసి.. పెద్ద గొడవ అవుతుందని అప్పూ అంటుంది. అయినా వాళ్లు చాలా చెడుగా కామెంట్స్ చేస్తారు. దీంతో అప్పూ సహనం నశించి.. వాళ్లను కొడుతుంది. ఆ తర్వాత బంటీ కళ్యాణ్‌కి కాల్ చేస్తాడు. ఏంటి నేను ఎన్ని సార్లు చేసినా ఫోన్ చేయడం లేదు. నీకు కూడా అంత అలుసు అయిపోయానా? అని అడుగుతాడు కళ్యాణ్. అప్పూని అరెస్ట్ చేశారని బంటీ అసలు విషయం అంతా చెప్తారు. దీంతో కళ్యాణ్ హడావిడిగా స్టేషన్‌కు వెళ్తాడు. ఏంట్రా ఎక్కడికి? మళ్లీ ఆ అప్పూ ఇంటికేనా అని అడుగుతుంది ధాన్య లక్ష్మి. కానీ కళ్యాణ్ అబద్ధం చెప్పి.. వెళ్తాడు. ఇక ఇవాళ్టితో ఈ రోజు ఎపిసోడ్ ముగుస్తుంది.