యూనివర్సల్ హీరో కమల్ హాన్ నటించిన అద్భుతమైన సినిమాల్లో భారతీయుడు సినిమా ఒకటి. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలో కమల్ హాసన్ డ్యూయల్ రోల్ లో నటించి మెప్పించారు. ఇక ఈ సినిమాకు ఏ ఆర్ రెహమాన్ అద్భుతమైన సంగీతాన్ని అందించారు. ఈ సినిమాలోని పాటలు ఇప్పటికి వింటుంటారు కొందరు. ఇక ఈ సినిమాలో కమల్ తన నటవిశ్వరూపంతో మెప్పించారు. అవినీతి పై లంచగొండితనం పై పోరాడుతారు కమల్. అప్పట్లో ఈ సినిమా సెన్సేషనల్ హిట్. ఇక ఈ సినిమాలో ముసలి కమల్ హాసన్ కు భార్య నటించిన హీరోయిన్ ఎవరో తెలుసా.? చాలా మందికి ఆమె ఎవరో తెలియకపోవచ్చు. కమల్ భార్యగా ఆమె అద్భుతంగా నటించింది.

రీసెంట్ గా భారతీయుడు 2 సినిమా రిలీజ్ అయ్యింది. ఈ సినిమా భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కానీ ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. దాంతో భారతీయుడు వన్ సినిమా అద్భుతంగా తెరకెక్కించారు. అప్పటి జనరేషన్స్ కు ఆ సినిమా ఓ మధురజ్ఞాపకం అని అందరూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే భారతీయుడు సినిమాకు సంబందించిన విషయాలు వైరల్ అవుతున్నాయి. వాటిలో ఈ హీరోయిన్ ఒకరు. భారతీయుడు సినిమాలో ముసలి కమల్ హాసన్ భార్యగా నటించింది ఎవరో కాదు ఆమె పేరు సుకన్య.

చాలా సినిమాల్లో ఆమె క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేసి మెప్పించారు. అమ్మ , వదిన పాత్రల్లో ఎక్కువగా కనిపించారు సుకన్య. తెలుగు, తమిళ్ భాషల్లో చాలా సినిమాల్లో నటించారు సుకన్య. సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన శ్రీమంతుడు సినిమాలో మహేష్ తల్లిగా కనిపించారు సుకన్య. ఇప్పటికీ ఆమె సినిమాలు చేస్తూ ఆకట్టుకుంటున్నారు. కానీ సోషల్ మీడియాలో సుకన్య పెద్దగా యాక్టివ్ గా ఉండరు. కానీ ఆమె ఫ్యాన్ పేజ్ ల్లో ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఇప్పటికీ ఆమె అంతే అందంగా ఉన్నారు. ఆమె లేటెస్ట్ ఫోటోలకు నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.