రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

Kalki 2898 AD: ఇటివల విడులైన ప్రభాస్ (Prabhas) కల్కి 2898 ఏడి (Kalki 2898 AD) మంచి విజయం సాధించి సంగతి తెలిసిందే. మంచి వసూళ్లు కూడా రాబట్టింది. ఇప్పుడీ సినిమాని ప్రపంచంలోనే అతిపెద్దదైన ఐమాక్స్ ధియేటర్లో ప్రదర్శించారు. లాస్ ఏంజిల్స్ లో ఉన్న టీసీఎల్ చైనీస్ ధియేటర్లో కల్కి ప్రదర్శించారు. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు నాగ్ అశ్విన్ హాజరై ప్రేక్షకులతో తన అభిప్రాయాలు పంచుకున్నారు.

‘కల్కిలో మీరు చూసింది కొంత భాగమే. రెండో భాగంలో అసలైన సినిమా చూస్తారు. కల్కిని రెండు భాగాలుగా చిత్రీకరించాలని అనుకోలేదు. చిత్రీకరణలో భాగంగా కథ పెరిగిపోవడంతో రెండు భాగాలుగా తెరకెక్కించాలని నిర్ణయించాం. ఇప్పటికే కొంత భాగం షూటింగ్ కూడా పూర్తయింది. మొదటి భాగానికి నాలుగున్నరేళ్లు పట్టింది. రెండో భాగానికి అంత సమయం తీసుకోవాలని అనుకోవట్లేద’ని అన్నారు.

ఇప్పటికే సినిమా రూ.1000కోట్లు వసూళ్లు సాధించినట్టు చిత్ర బృందం ప్రకటించింది. అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకునే ప్రధాన పాత్రల్లో నటించారు. విజయ్ దేవరకొండ అర్జునుడిగా.. ప్రభాస్ కర్ణుడిగా కనిపించడంతో పార్ట్-2పై అంచనాలు పెరిగిపోయాయి.

‘’