రామ్ చరణ్ (Ram charan) హీరోగా నటిస్తున్న ఆర్ సీ 16 (RC 16) సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ ఊపందుకున్నాయి. ఇప్పటికే మ్యూజిక్ సిట్టింగ్స్ ఒక కొలిక్కి రాగా..మిగతా మ్యూజిక్ కంపోజిషన్స్ తోపాటు ప్రొడక్షన్ డిజైన్ కు సంబంధించిన పనులు తాజాగా దుబాయ్ లోని ఫిర్దౌస్ స్టూడియోలో ప్రారంభించారు. ఈ సందర్భంగా దర్శకుడు బుచ్చిబాబు సాన (Bucchi babu sana), సినిమాటోగ్రాఫర్ రత్నవేలు, మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ (AR Rehman) ఫొటో తీసుకుని సోషల్ మీడియా ద్వారా షేర్ చేశారు.

విలేజ్ బ్యాక్ డ్రాప్ స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కనున్న ఈ సినిమాలో హై క్వాలిటీ ప్రొడక్షన్ వ్యాల్యూస్ చూపించేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమాలో కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ నటిస్తున్నట్లు ఇటీవలే చిత్రబృందం ప్రకటించింది. జాన్వీ కపూర్ (jhanvi kapoor) హీరోయిన్ గా నటిస్తున్న ఆర్ సీ 16 తెలుగు నుంచి రాబోతున్న మరో భారీ పాన్ ఇండియా మూవీ కానుంది.