Murari: టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న దర్శకుడు కృష్ణవంశీ దర్శకత్వంలో మహేష్ బాబు సోనాలి బింద్రే హీరో హీరోయిన్లుగా నటించిన సూపర్ హిట్ చిత్రం మురారి. 2001 ఫిబ్రవరి 17వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చి అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకున్న ఈ సినిమా ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకుంది.

ముఖ్యంగా ఈ సినిమాలోని పాటలు ఎప్పటికీ ఎవర్ గ్రీన్ సాంగ్స్ అని చెప్పాలి. ఇక ఈ సినిమా అప్పట్లో ఎంతో మంచి సక్సెస్ అందుకుంది. అయితే ఈ సినిమా విడుదలైన ఇన్నేళ్లకు తిరిగి ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సిద్ధమయ్యారు ఆగస్టు 9వ తేదీ మహేష్ బాబు పుట్టినరోజు కావడంతో అదే రోజున ఈ సినిమానే విడుదలకు సిద్ధం చేస్తున్నారు

ఈ క్రమంలోనే ఈ సినిమా తిరిగి ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో డైరెక్టర్ కృష్ణవంశీ ఈ సినిమా ప్రమోషన్లను నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే సోషల్ మీడియా వేదికగా అభిమానులు నేటిజన్స్ అడిగే ప్రశ్నలకు ఈయన సమాధానాలు చెబుతూ వచ్చారు. ఈ తరుణంలోనే ఒక నెటిజన్ ఈ సినిమా ఫ్లాప్ అంటూ కామెంట్ చేశారు.

మురారి సినిమా ఫ్లాప్..
ఇలా నేటిజన్ చేసిన కామెంట్ పై కృష్ణవంశీ స్పందిస్తూ ఈ సినిమాకి వచ్చిన కలెక్షన్ల గురించి క్లారిటీ ఇచ్చారు.హలో అండీ.. నేను మురారి నిర్మాత ఎన్‌.రామలింగేశ్వరరావుగారి నుంచి రూ.55లక్షలకు ఐదేళ్ల పాటు తూర్పుగోదావరి జిల్లా హక్కులను కొన్నాను. ఫస్ట్‌ రన్‌లో 1 కోటి 30 లక్షలు వచ్చాయని తెలిపారు.ఒకవేళ వసూళ్లే ప్రాతిపదిక అయితే, సినిమా ఫ్లాఫ్‌ లేదా సూపర్‌హిట్‌ అనేది మీరే నిర్ణయించుకోండి అంటూ ఈయన చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.