మే 1999లో, సియాచిన్ గ్లేసియర్‌ను స్వాధీనం చేసుకునే లక్ష్యంతో పాకిస్తాన్ సైన్యం కార్గిల్ సమీపంలో సైనికులకు రహస్యంగా శిక్షణ ఇచ్చింది. దీనిపై స్థానిక గొర్రెల కాపరి భారత సైన్యాన్ని అప్రమత్తం చేశాడు.

జూలై 26, 1999న, పాకిస్తాన్‌పై సుమారు 3 నెలల పాటు జరిగిన కార్గిల్ యుద్ధంలో భారత సాయుధ దళాలు విజయం సాధించాయి. దేశ సార్వభౌమత్వాన్ని కాపాడేందుకు ధైర్యంగా పోరాడిన వీర జవాన్లకు ఈ రోజు అంకితం.

మే 1999లో, సియాచిన్ గ్లేసియర్‌ను స్వాధీనం చేసుకునే లక్ష్యంతో పాకిస్తాన్ సైన్యం కార్గిల్ సమీపంలో సైనికులకు రహస్యంగా శిక్షణ ఇచ్చింది. దీనిపై స్థానిక గొర్రెల కాపరి భారత సైన్యాన్ని అప్రమత్తం చేశాడు.

కార్గిల్ విజయ్ దివస్ 25వ వార్షికోత్సవం సందర్భంగా దేశం మొత్తం శనివారం కార్గిల్ విజయ్ దివస్‌ను జరుపుకుంటుంది. ముఖ్యంగా, ఇది 1999 కార్గిల్ యుద్ధంలో పాకిస్తాన్ దళాలపై భారతదేశం సాధించిన విజయాన్ని స్మరించుకుంటుంది. దేశ సమగ్రత కోసం 500 మందికి పైగా సైనికులు తమ ప్రాణాలను అర్పించారు.

25వ విజయ్ దివస్ వార్షికోత్సవం సందర్భంగా కార్గిల్ యుద్ధ వీరులను సన్మానించేందుకు ప్రధాని మోదీ శుక్రవారం లడఖ్‌లోని ద్రాస్ సెక్టార్‌ను సందర్శించారు. కార్గిల్ యుద్ధ స్మారకం వద్ద పుష్పగుచ్ఛం ఉంచి సైనికులకు నివాళులర్పిస్తూ ‘పరిక్రమ’ నిర్వహించారు.

కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా ప్రధాని మోదీ శుక్రవారం ద్రాస్‌లో పాకిస్థాన్‌కు గట్టి వార్నింగ్ ఇచ్చారు. ఉగ్రవాదం మరియు ప్రాక్సీ వార్‌ఫేర్‌పై పాకిస్తాన్ ప్రయత్నాలు పదేపదే విఫలమయ్యాయని ఆయన నొక్కి చెప్పారు. పాకిస్థాన్ తన చరిత్ర నుంచి ఏమీ నేర్చుకోలేదని ప్రధాని అన్నారు.

ఈ సందర్భంగా కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కఠినమైన పరిస్థితుల్లో దేశాన్ని రక్షించిన వీర జవాన్లను సన్మానించారు. వారి ధైర్యాన్ని, నిబద్ధతను, దేశభక్తిని కొనియాడుతూ, వారి త్యాగం భవిష్యత్ తరాలకు స్ఫూర్తినిస్తుందని ఉద్ఘాటించారు.