On the occasion of the Bonalu festival, Telangana Deputy CM Bhatti Vikramarka will present silk cloths to Goddess ‘Mahankali’ at Lal Darwaja Simhavahini Temple.

హైదరాబాద్‌లోని పాతబస్తీలో లాల్ దర్వాజ మహంకాళి బోనాల ఉత్సవాలు ఈరోజు ఉదయం ప్రారంభమయ్యాయి. పాతబస్తీలోని సింహవాహిని ఆలయంతో పాటు కనీసం 330 ఆలయాలను కూడా శోభాయమానంగా అలంకరించారు.

On the occasion of the Bonalu festival, Telangana Deputy CM Bhatti Vikramarka will present silk cloths to Goddess ‘Mahankali’ at Lal Darwaja Simhavahini Temple.

లాల్ దర్వాజ మహంకాళి బోనాల ఉత్సవాల సందర్భంగా హైదరాబాద్ పోలీసులు నగరంలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. మరో రెండు రోజుల పాటు ఈ ఆంక్షలు అమలులో ఉంటాయని, వాహనదారులు పోలీసులకు సహకరించాలని కోరారు.

ఫలక్‌నుమా, చార్మినార్, మీర్ చౌక్, బహుదూర్‌పురా, పాతబస్తీలోని పలు ప్రాంతాల్లో సోమవారం రాత్రి వరకు ఈ ట్రాఫిక్ ఆంక్షలు విధించనున్నారు.

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఉదయం 11 గంటలకు భాగ్యలక్ష్మి ఆలయానికి చేరుకుని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. ఆ తర్వాత పాతబస్తీలోని లాల్ దర్వాజ మహంకాళి బోనాల ఉత్సవాల్లో పాల్గొంటారు. సంజయ్ పర్యటనకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.

లాల్ దర్వాజ బోనాలు మొదటిసారిగా 1907లో మహారాజా కిషన్ ప్రారంభించాడు. అప్పటి హైదరాబాద్ నవాబ్ మీర్ మహబూబ్ అలీఖాన్ ఈ బోనాల పండుగ కోసం భూమిని విరాళంగా ఇచ్చారు. అంతేకాకుండా, అనేక హిందూ దేవాలయాల నిర్మాణానికి భూమిని విరాళంగా ఇచ్చారు.