హైదరాబాద్: తెలంగాణ కేబినెట్ సమావేశం ఆగస్టు 1న జరగనుంది.

తెలంగాణ శాసనసభ ఆవరణలోని అసెంబ్లీ కమిటీ హాల్‌-1లో ఆగస్టు 1వ తేదీ సాయంత్రం 4 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధ్యక్షతన ఈ సమావేశం జరుగుతుందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి సోమవారం జారీ చేసిన సర్క్యులర్‌లో పేర్కొన్నారు.

కేబినెట్ సమావేశానికి సంబంధించిన ఎజెండా ఇంకా వెల్లడి కానప్పటికీ, కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవచ్చని భావిస్తున్నారు.