• నేలకొరిగిన నిద్రగన్నేరు చెట్టు
  • 300 సినిమాల్లో పలు సన్నివేశాలు
  • సినీ వృక్షంను బతికించాలన్న డైరెక్టర్ వంశీ

కొవ్వూరు మండలం కుమారదేవం గోదావరి ఒడ్డున ప్రకృతి సోయగానికి చిరునామాగా నిలిచిన ‘నిద్రగన్నేరు చెట్టు’ ఇటీవల నేలకొరిగిన విషయం తెలిసిందే. ఎన్నో ప్రకృతి విపత్తులను ఎదుర్కొని.. వందల సినిమాల్లో అద్భుత సన్నివేశాలకు వేదికగా నిలిచింది ఈ వృక్షం. సుమారు 300 సినిమాల్లోని పలు సన్నివేశాలు, పాటలను ఇక్కడ చిత్రీకరించారు. నేలకొరిగిపోయిన ఈ సినిమా చెట్టును చూసి ప్రముఖ సినీ దర్శకులు వంశీ విస్మయం చెందారు.

Also Read: RJ Shekhar Bhasha: ఆర్జే శేఖర్ బాషాపై కేసు నమోదు!

‘సినిమా రంగంతో ఈ చెట్టుకు విడదీయుని బంధం ఉంది. ఈ చెట్టుతో నాకు విడదీయరాని అనుబంధం ఉంది. 18 సినిమాలు ఇక్కడే నిర్మించా. తరచూ మిత్రులతో కలిసి వచ్చి ఈ చెట్టు కింద భోజనం చేసేవాడిని. ఈ చెట్టును మళ్లీ బతికించాలి. చెట్టుకు జీవం పోసి పునరుద్ధరణ చేస్తే.. మరిన్ని సినిమాలు తీస్తా’ అని డైరెక్టర్ వంశీ మీడియాతో అన్నారు. 1975లో వచ్చిన పాడి పంటలతో ఈ వృక్షం ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.