ప్రస్తుతం యువత మొటిమలతో బాధపడుతోంది. చాలా మందికి వయసు పెరిగే కొద్ది మొటిమలు ఎక్కువవుతున్నాయి. వాటి నివారణకు మార్కెట్లో దొరికే ఆయింటిమెంట్స్, మందులను వాడుతుంటారు. ఎన్ని వాడినా.. అవి వాడినన్ని రోజులు మాత్రమే మొటిమలు తగ్గుముఖం పట్టినట్లు కనిపిస్తుంది. ఆ ఆయింటిమెంట్స్ మానేసిన తర్వాత మళ్లీ మొదటికే వస్తుంది. మొటిమల నివారణకు ఓ ఆరోగ్యకరమైన, రుచికరమైన చిట్కాను చెప్పారు.. నిపుణుల. చేపలకు సంబంధించి మరో ఆరోగ్య ప్రయోజనం బయటపెట్టారు. ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు దండిగా ఉండే సాల్మన్, సార్‌డైన్స్‌ వంటి చేపలు మొటిమలు త్వరగా తగ్గటానికి తోడ్పడుతున్నట్టు తాజాగా బయటపడింది. స్వల్పంగా, ఒక మాదిరిగా మొటిమలు గలవారిని పరిశోధకులు విశ్లేషించగా వీరిలో 98% మందిలో ఒమేగా 3 కొవ్వు ఆమ్లాల మోతాదులు తక్కువగా ఉంటున్నట్టు తేలింది.

READ MORE: PM MODI: కేంద్ర పథకాలను అమలు చేయాల్సిందే..బీజేపీ పాలిత రాష్ట్రాలకు మోడీ టాస్క్

ఈ కొవ్వు ఆమ్లాలు ఎక్కువగా ఉండే మధ్యధరా ప్రాంత ఆహారం, మాత్రలను ఇవ్వగా వారికి మంచి ఫలితం కనిపించటం విశేషం. ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు ఒంట్లో వాపు ప్రక్రియను (ఇన్‌ఫ్లమేషన్‌) తగ్గిస్తాయి. చర్మంలో నూనె ఉత్పత్తిని నియంత్రిస్తాయి. ఇవి వాపు ప్రక్రియను ప్రేరేపించే రసాయనాలను నిరోధించటం ద్వారా మొటిమలు తగ్గేలా చేస్తాయని పరిశోధకులు చెబుతున్నారు. కానీ కొందరు నిపుణులు దీనిపై సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఇతరులతో పోల్చకపోవటం వల్ల మొటిమలు తగ్గటమనేది ఆహారం, పాల పదార్థాలు తగ్గించటం, ఒమేగా 3 మాత్రలు, ఇతర పద్ధతుల్లో ఏవి ప్రభావం చూపిస్తున్నాయో తెలియటం లేదంటున్నారు. అయినా కూడా పండ్లు, కూరగాయలు, నిండు ధాన్యాల్లో యాంటీఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండే మాట నిజం. చర్మ ఆరోగ్యానికివి బాగా ఉపయోగపడతాయి. చేపలు, గింజ పప్పుల్లో వాపును నిలువరించే గుణం ఉండటం గమనార్హం. ఇవి దురద, మొటిమల వంటి చర్మ సమస్యలు తగ్గటానికి దోహదం చేస్తాయి. ఆలివ్‌ నూనె చర్మాన్ని మృదువుగా ఉంచుతుంది.