• చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఎంట్రీ
  • మహానటితో స్టార్ ఇమేజ్
  • బాలీవుడ్‌లోకి ఎంట్రీ

Actress Keerthy Suresh Says I faced Most Trolls in Career Beginning: అత్యధిక ట్రోల్స్ ఎదుర్కొన్న దక్షిణాది నటిని తానే అని హీరోయిన్ ‘మహానటి’ కీర్తి సురేశ్‌ చెప్పారు. కెరీర్‌ ఆరంభంలో తాను నటించిన చాలా సినిమాలు బాక్సాఫీస్‌ వద్ద బోల్తా కొటాయని, దాంతో చాలామంది తనని విమర్శించారని పేర్కొన్నారు. ట్రోల్స్ వల్ల కొన్ని సందర్భాల్లో తాను చాలా బాధపడ్డానని తెలిపారు. కావాలని చేసే నెగెటివ్‌ కామెంట్స్‌ను తాను పెద్దగా పట్టించుకోనని కీర్తి చెప్పుకొచ్చారు. తాజాగా ఓ పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్న కీర్తి పలు విషయాలపై స్పందించారు.

‘వర్క్ విషయంలో చాలా సంతోషంగా ఉన్నా. నాకు నచ్చిన చిత్రాల్లో నటిస్తున్నా. కెరీర్‌ ఆరంభంలో నేను చేసిన చాలా సినిమాలు ఫ్లాప్‌ అయ్యాయి. దాంతో నేను ఎన్నో ట్రోల్స్‌ ఎదుర్కొన్నా. బహుశా అత్యధిక ట్రోల్స్ ఎదుర్కొన్న దక్షిణాది నటిని నేనే కావొచ్చు. మహానటి తర్వాత నాపై ట్రోల్స్‌ బాగా తగ్గాయి. వివరణాత్మక విమర్శల నుంచి నేను కొత్త విషయాలు నేర్చుకుంటా. అయితే కొంతమంది కావాలని చేసే నెగెటివ్‌ కామెంట్స్‌ గురించి పెద్దగా పట్టించుకోను. కాలమే అన్నింటికీ సమాధానం చెబుతుందని భావిస్తా’ అని రఘు తాత సినిమా ప్రమోషన్‌లో భాగంగా కీర్తి సురేశ్‌ చెప్పారు.

Also Read: Arshad Nadeem: ఆరంభంలో క్రికెట్‌ ఆడా.. నీరజ్‌తో పోటీ పడటం బాగుంటుంది: పాక్‌ అథ్లెట్ అర్షద్

2000లో మలయాళ చిత్రం పైలట్స్‌తో కీర్తి సురేష్ చైల్డ్ ఆర్టిస్ట్‌గా నటించారు. పాంభు సత్తాయ్, పెంగ్విన్, మరక్కర్, నేను లోకల్, మహానటి, సర్కారు వారి పాట, దసరా వంటి హిట్ సినిమాల్లో కథానాయికగా నటించారు. తెలుగులో మహానటి చిత్రంకు ఉత్తమ నటిగా జాతీయ చలనచిత్ర అవార్డును గెలుచుకున్నారు. దసరాలో తన పాత్రకు ఫిలింఫేర్ సౌత్ అవార్డ్స్‌లో ఉత్తమ నటి అవార్డును అందుకున్నారు. ఇటీవల రఘు తాత పూర్తి చేసిన కీర్తి.. ‘బేబీ జాన్‌’తో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్నారు.