Thyagarajan : “చుక్కల పల్లకిలో..”తదిగణతోం తప్ప దమ్మ..” రాధా రాధా మదిలోన మన్మధ బాధ.. రాత్రి పగలు..” వన్ టూ త్రీ.. ఇలాంటి పాటలు అప్పట్లో ఒక ఊపు ఊపాయి. చిరంజీవి – బప్పిలహరి ఈ కాంబినేషన్లో వచ్చిన మొదటి సినిమా స్టేట్ రౌడీ. ఈ కాంబినేషన్ లో ఆ తర్వాత వచ్చిన గ్యాంగ్ లీడర్, రౌడీ అల్లుడు చిత్రాలు మ్యూజికల్ గా సూపర్ హిట్ అయ్యాయి. బి.గోపాల్ చిరంజీవి కాంబినేషన్ లో వచ్చిన మొదటి సినిమా కూడా ఇదే.

1989 మహేశ్వరి పరమేశ్వరి ప్రొడక్షన్స్, బి.గోపాల్ దర్శకత్వంలో స్టేట్ రౌడీ చిత్రం విడుదలైంది. ఈ సినిమాలో చిరంజీవి, రాధ, భానుప్రియ హీరో, హీరోయిన్లుగా నటించారు. ఇందులో చిరంజీవి రౌడీ, పోలీస్ అనే రెండు విభిన్నమైన పాత్రల్లో కనిపిస్తారు. రాయలసీమ రుస్తుంని, నైజాం దాదాని, ఆంధ్రా గుండాని.. టోటల్ గా స్టేట్ రౌడీని. అనే డైలాగు ఈ సినిమాలో చిరంజీవి చెప్తున్నంత సేపూ అభిమానులు ఈలలతో థియేటర్ మొత్తం గోలలు చేశారు. రౌడీలను ఆటపట్టిస్తూ.. డిఫరెంట్ స్టైల్లో వచ్చిన పాట “నే యముడికి మొగుడినిరా మనసు గల మనిషినిరా..” ఈ పాట అభిమానుల్లో మంచి కిక్ ఇచ్చింది.

ఒక నైజాం ఏరియాలో కోటి రూపాయల వసూళ్లను రాబట్టిన మొదటి తెలుగు చిత్రం స్టేట్ రౌడీ. సినిమా కథలో రావు గోపాల్ రావు తమ్మునిగా కనిపించిన త్యాగరాజన్ భయంకరమైన విలనిజాన్ని పండించాడు. ఈయన తమిళనాడుకు చెందిన ప్రముఖ దర్శకుడు, నటుడు, నిర్మాతగా కూడా వ్యవహరించారు. ప్రముఖ నటి రాధ లీడ్ రోల్ లో వచ్చిన “అలైగల్ ఒయివతిల్లై’ అనే తమిళ సినిమాలో రాధకు పెద్దన్నయ్యగా త్యాగరాజన్ నటించారు. ఆ తర్వాత మలయాళంలో వచ్చిన ‘మలయూర్ మాంబిటియాన్’ అనే చిత్రం ఆయనకి మంచి బ్రేక్ ఇచ్చింది. 1981వచ్చిన రామదండు చిత్రంలో మొదటి సారిగా తెలుగులో త్యాగరాజన్ నటించారు.

ఆ తర్వాత ఏకలవ్య, అంతిమ తీర్పు, స్టేట్ రౌడీ, మగాడు చిత్రాల్లో ఆయన నటించారు. అయితే ఈయన ఎవరో కాదు.. 1993 దుర్గా ఫిల్మ్స్, నిర్మాణం, కె.ఋష్యేంధర్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన తొలిముద్దు చిత్రంలో నటించిన హీరో ప్రశాంత్ కు స్వయాన తండ్రి. త్యాగరాజన్ ప్రశాంత్ కు తండ్రి మాత్రమే కాదు.. అపరిచితుడు, మల్లన్న, ఐ చిత్రాల ఫేమ్ విక్రమ్ కి స్వయానా మేనమామ వరస అవుతాడు. ఈ ఇద్దరు హీరోలు కూడా శంకర్ దర్శకత్వంలో నటించారు. హీరో ప్రశాంత్, శంకర్ దర్శకత్వంలో 1998లో విడుదలైన జీన్స్ చిత్రంలో నటించారు. హీరో విక్రమ్, శంకర్ దర్శకత్వం వహించిన అపరిచితుడు, ఐ చిత్రాల్లో నటించారు.