ఈ వార్తను అనువదించండి:

ప్రభుత్వం మారిన పెత్తనం మాత్రం మేఘా కృష్ణారెడ్డిదేనని బీజేఎల్పీ నేత మహేశ్వరరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ రోజు నిర్వహించిన ప్రెస్ మీట్ లో మహేశ్వరరెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వాలు మారుతున్నా కాంట్రాక్టర్ మాత్రం మారాడం లేదని ఫైర్ అయ్యారు. నాసిరకం పనులు చేసే కాంట్రాక్టులన్నీ మేఘాకే ఇస్తున్నారని ఆరోపించారు. తద్వారా లక్షల కోట్ల రూపాయల ప్రజాధనం దుర్వినియోగం అవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో ఉన్న టెండర్ ను ఎస్కలెట్ చేయడంలో మేఘా కంపెనీ పాత్ర ఉందన్నారు. సుంకిశాల ప్రాజెక్ట్ గోడ కూలి పది రోజులు అయినా ప్రభుత్వం దృష్టికి రాలేదా? అని ప్రశ్నించారు. వచ్చినా.. ఆ సంస్థను కాపాడుకునేందుకే ఈ విషయాన్ని దాచారా? అన్న అనుమానాన్ని మహేశ్వరరెడ్డి వ్యక్తం చేశారు. నాయకులు నాసిరకం పనులు చేసే గుత్తేదార్లను కాపాడుతున్నారని ఆరోపించారు. లక్షల కోట్ల ప్రజా ధనాన్ని దోచుకుంటున్న మేఘా సంస్థను బ్లాక్ లిస్ట్ లో పెట్టాలని డిమాండ్ చేశారు.

పూర్తిగా చదవండి..