ఈ వార్తను అనువదించండి:

ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల ఉపవర్గీకరణకు అనుమతిస్తూ ఇటీవలకు సుప్రీంకోర్టు సంచలన తీర్పునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ రిజర్వేషన్లకు క్రీమీ లేయర్‌ను కూడా వర్తింపజేయాలని ఈ తీర్పు వెలువరించిన నలుగురు న్యాయమూర్తులు రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించారు. ఈ నేపథ్యంలో కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లకు క్రీమీ లేయర్‌ను వర్తింపజేయకూడదని నిర్ణయించింది. ఈ విషయంలో సుప్రీంకోర్టు సూచించినదాన్ని పరిగణలోకి తీసుకోకూడదనే అభిప్రాయానికి వచ్చింది. శుక్రవారం రాత్రి ప్రధాని మోదీ నేతృత్వంలో జరిగిన కేంద్ర కేబినెట్ మీటింగ్‌లో ఈ అంశంపై చర్చించిన తర్వాత నిర్ణయం తీసుకున్నామని కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్‌ తెలిపారు. రాజ్యాంగం ప్రకారం రిజర్వేషన్లకు ఎస్సీ, ఎస్టీలకు క్రీమీ లేయర్ నిబంధన లేదని.. అందుకే దీన్ని అమలుచేయకూడదని మంత్రివర్గం నిర్ణయించిందని పేర్కొన్నారు.

పూర్తిగా చదవండి..