Breaking: ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగలపూడి అనితకు తృటిలో పెద్ద ప్రమాదం తప్పింది. మంత్రి కాన్వాయ్ లోని ఓ కారు సడెన్గా బ్రేక్ వేయడంతో వెనుకనే ఉన్న మంత్రి కారు దానిని వేగంగా ఢీ కొట్టింది. విజయవాడ నుంచి పశ్చిమగోదావరి జిల్లా అలంపురం వెళ్తుండగా ఏలూరు జిల్లా ఉంగుటూరు మండలం కైకరం వద్ద ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు వివరించారు.

ఓ బైక్ ను తప్పించే క్రమంలోనే ఎస్కార్ట్ కారు డ్రైవర్ సడెన్ గా బ్రేక్ వేసినట్లు తెలుస్తుంది. ఈ ప్రమాదంలో హోం మంత్రి అనిత కారు, ఎస్కార్ట్‌ వాహనం స్వల్పంగా దెబ్బతిన్నాయి. ఈ ఘటనలో మంత్రితో సహా కారులోని ఎవరికీ ఎలాంటి గాయాలు కాకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాదం జరిగిన తరువాత మంత్రి అనిత మరో వాహనంలో అలంపురం వెళ్లారని అధికారులు తెలిపారు.

Also Read: పవన్ వద్దకు దువ్వాడ ఫ్యామిలీ ఇష్యూ..!

The post Breaking: ఏపీ హోంమంత్రి అనితకు తృటిలో తప్పిన ప్రమాదం! appeared first on Rtvlive.com.