Shweta Basu Prasad: సినీ ఇండస్ట్రీలో జీవితాలు అనేది నీటి బుడగ లాంటివి ఎప్పుడూ ఎవరి జీవితం ఎలా తారు మారవుతుందో ఎవరికి తెలియదు ఇండస్ట్రీలో వచ్చిన సక్సెస్ నిలబెట్టుకోవాలంటే ఎంతో కష్టమైన పని అని చెప్పాలి మనకు తెలిసి తెలియకుండా చేసిన కొన్ని తప్పులు కారణంగా మన జీవితాలే తారుమారు అవుతూ ఉంటాయి. ఇలా ఇండస్ట్రీలో ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సొంతం చేసుకొని అప్రతిష్ట పాలైన సెలబ్రిటీలో ఎంతోమంది ఉన్నారు.

అలాంటి వారిలో నటి శ్వేతా బసు ప్రసాద్ ఒకరు. తెలుగులో ఈమె కొత్త బంగారులోకం అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా ద్వారా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న ఈమెకు అనంతరం వరుసగా సినిమా అవకాశాలు వచ్చాయి. శ్వేత బసు ప్రసాద్. 2002లో మక్డీ సినిమాతో బాలనటిగా బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. కహానీ ఘర్ ఘర్ కీ అనే టీవీ షో ఆమెకు ఇంటి గుర్తింపును ఇచ్చింది.

మొదట షారుఖ్ ఖాన్ నటించిన ‘ఫిర్ భీ దిల్ హై హిందుస్తానీ’లో కనిపించింది. ఆ తర్వాత ‘మక్డీ’ సినిమాలో నటించి ఉత్తమ బాలనటిగా అవార్డు కూడా అందుకుంది. అయితే 2014వ సంవత్సరంలో ఈమె సెక్స్ రాకెట్ కేసులో పోలీసులకు పట్టుబడ్డారు. బంజారాహిల్స్ లోని ఓ హోటల్ పై పోలీసులు దాడి చేశారు. అక్కడ నుంచి శ్వేతా ప్రసాద్ బసును వ్యభిచారం ఆరోపణలపై అరెస్టు చేశారు.

అవకాశాలు గగనం..

ఇక అరెస్ట్ తర్వాత బయటకు వచ్చిన ఈమె తన గురించి వచ్చినటువంటి ఆరోపణలను పూర్తిగా ఖండించారు. అనంతరం ఈమెకు పోలీసులు కూడా క్లీన్ చిట్ ఇవ్వడంతో తిరిగి ఇండస్ట్రీపై ఫోకస్ పెట్టినప్పటికీ ఆమె పట్ల ఇలాంటి ఒక మచ్చ పడటంతో తనకు అవకాశాలు రావడం కూడా గగనంగానే ఉన్నాయని చెప్పాలి.