ఈ వార్తను అనువదించండి:

స్మితా సబర్వాల్: యూపీఎస్సీలో దివ్యాంగుల కోటాపై ఐఏఎస్ స్మితా సబర్వాల్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై దుమారం చెలరేగుతూనే ఉంది. తాజాగా ఈ వ్యవహారం హైకోర్టుకు చేరింది. స్మితా సబర్వాల్ అనుచిత వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలంటూ సామాజికవేత్త వసుంధర తెలంగాణ హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. స్మితాపై చర్యలకు యూపీఎస్సీ చైర్మన్‌కు ఆదేశాలివ్వాలంటూ పిటిషనర్‌ పిటిషన్ లో కోరారు. దీంతో విచారణ జరిపిన న్యాయస్థానం పిటిషనర్ అర్హతలపై ప్రశ్నించగా.. పిటిషనర్ ఒక దివ్యాంగురాలు అని పిటిషనర్ తరపు న్యాయవాది కోర్టుకు వివరించారు. ఈ నేపథ్యంలో పూర్తి వివరాలతో కూడిన అఫిడవిట్ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇదిలా ఉంటే.. దివ్యాంగులతో పాటు పలువురు రాజకీయ నాయకులు, ప్రజలు స్మితా తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆమె వ్యాఖ్యలను ఉపసంహరించుకుని, దివ్యాంగులకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.

పూర్తిగా చదవండి..