Bharath- Maldives: గతేడాది ప్రధాని మోదీ లక్షద్వీప్‌లో పర్యటించిన సందర్భంలో ఆయనపై మాల్దీవుల అధ్యక్షుడు అనుచిత వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. దీంతో మాల్దీవులకు వ్యతిరేకంగా సోషల్‌మీడియాలో పెద్ద ఎత్తున ట్రోలింగ్‌ జరిగింది. భారత్‌ నుంచి చాలా మంది పర్యాటకులు మాల్దీవులను సందర్శించడానికి వెళ్లకపోవడంతో ఆ దేశ ఆర్థిక స్థితిగతులు దాదాపు తారుమారు అయ్యాయి. దీంతో దెబ్బకి మాల్దీవుల ప్రభుత్వం దిగి వచ్చింది.

ఈ క్రమంలోనే మాల్డీవుల అధ్యక్షుడు మహహ్మద్‌ ముయిజ్జూ ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను మెరుగుపరిచేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టారు. విదేశాంగ మంత్రి జై శంకర్‌ సోమవారం మాల్దీవుల పర్యటనను ముగించారు. ఈ సమయంలో పలు అవగాహన ఒప్పందాల మీద ఇరు దేశాల నాయకులు సంతకాలు చేశారు.

ఆరు హై ఇంపాక్ట్ కమ్యూనిటీ డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్‌లను ప్రారంభించారు. పరస్పరం చేసుకున్న అవగాహన ఒప్పందాలలో భారతదేశంలో అదనంగా 1,000 మంది మాల్దీవుల సివిల్ సర్వెంట్ల సామర్థ్యాన్ని పెంపొందించడానికి, మాల్దీవులలో యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ ప్రవేశానికి సంబంధించిన ఒప్పందాలు ఉన్నాయి. ఆరు HICDPలు, భారతీయ గ్రాంట్ అసిస్టెన్స్‌తో మద్దతినిచ్చాయి, మానసిక ఆరోగ్యం, ప్రత్యేక విద్య, స్పీచ్ థెరపీ, స్ట్రీట్ లైటింగ్ వంటి రంగాలను కవర్ చేస్తాయి.

భారత్‌ కి 28 దీవులు ఒప్పందం

మాల్దీవులలోని 28 దీవులలో నీరు, పారిశుద్ద్య ప్రాజెక్టులను మెరుగుపరిచేందుకు భారత్‌ కి అప్పగించింది..మాల్దీవుల ప్రభుత్వం. జులై 23న సమర్పించిన యూనియన్ బడ్జెట్ 2024 మునుపటి సంవత్సరంతో పోలిస్తే 2024-25 ఆర్థిక సంవత్సరానికి ఈ ద్వీప దేశానికి సహాయంలో గణనీయమైన 48 శాతం తగ్గింపును వెల్లడించింది. ప్రస్తుత ఆర్థిక కేటాయింపులు మాల్దీవులకు రూ. 400 కోట్లను “గ్రాంట్స్”గా నిర్దేశించాయి, గత సంవత్సరం అందించిన రూ.770 కోట్లతో పోలిస్తే ఇది గణనీయంగా తగ్గింది. ఈ కేటాయింపు కూడా ఫిబ్రవరి 2024లో సమర్పించిన మధ్యంతర బడ్జెట్‌లో ప్రతిపాదించిన దానికంటే రూ.200 కోట్లు తక్కువ.

ముయిజ్జు భారతదేశాన్ని అభినందించారు

అధ్యక్షుడు మహ్మద్ ముయిజ్జు మాల్దీవులకు భారతదేశం నిరంతర అభివృద్ధి సహాయాన్ని ప్రశంసించారు. భారతదేశం-మాల్దీవుల సంబంధాన్ని మరింత లోతుగా చేయడానికి ప్రయత్నిస్తామని తెలిపారు.

Also Read: మాజీ మంత్రి జోగి రమేష్‌ కొడుకు అరెస్ట్

The post Bharat- Maldives: 28 దీవులను భారత్‌ కి అప్పగించిన మాల్దీవులు! appeared first on Rtvlive.com.