Hands Tingling: చేతులు తరచుగా వణుకుతూ ఉంటే జాగ్రత్తలు తీసుకోవడం ఎంతో ముఖ్యం. ఎందుకంటే ఇది ప్రమాదకరమైన వ్యాధికి సంకేతాలు కావచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. తరచుగా ఏదైనా శరీర భాగంలో బరువుతో ఎక్కువసేపు కూర్చొని, ఆపై అకస్మాత్తుగా లేవడం వల్ల జలదరింపు అనుభూతిని కలిగిస్తుంది. ఇలా అప్పుడప్పుడు జరగడం సహజమే కావచ్చు కానీ.. మళ్లీ మళ్లీ ఇలాగే జరిగితే తక్షణమే దృష్టి పెట్టాలి. చేతుల్లో జలదరింపు అనేక ఆరోగ్య సమస్యల లక్షణమని వైద్యులు అంటున్నారు. చేతులకు జలదరింపు ఎందుకు వస్తుందో ఇప్పుడు కొన్ని విషయాలు చూద్దాం.

చేతులు వణకడానికి కారణమేమిటి:

  • శరీరంలో విటమిన్ బి, ఇ లోపం ఉంటే నరాలు, ఇతర భాగాలపై ప్రభావం చూపుతుంది. సరైన ఆహారపు అలవాట్లు లేకపోవడం వల్ల పోషకాల లోపం ఏర్పడి చేతుల్లో, పాదాల్లో జలదరింపు వస్తుంది. ఈ సమస్య తగ్గాలంటే వెంటనే ఆహారంపై శ్రద్ధ వహించాలి.
  • హైపోథైరాయిడిజంతో ఉన్నవారిలో చేతుల్లో జలదరింపు సమస్య ఉంటుంది. థైరాయిడ్ లక్షణాలు కనిప్తే వెంటనే వైద్యులకు చూపించుకోవాలి.
  • అనేక మందుల దుష్ప్రభావాల వల్ల నరాల సంబంధిత సమస్యలు రావచ్చు. కొన్నిసార్లు క్షయ, అధిక రక్తపోటు, హెచ్‌ఐవి, అనేక ఇతర ఇన్‌ఫెక్షన్‌ల కారణంగా చేతులు, కాళ్లు మొద్దుబారవచ్చు, జలదరింపు సమస్య ఉండవచ్చు.
  • అతిగా మద్యం తాగినా కూడా నరాల, కణజాలం దెబ్బతింటుంది. దీని కారణంగా శరీరానికి అవసరమైన విటమిన్ బి 12, ఫోలేట్ వంటి పోషకాలు తగ్గుతాయి. దీనివల్ల నరాలపై చెడు ప్రభావాన్ని చూపడంతో చేతుల్లో జలదరింపు వస్తుంది.
  • ఏదైనా నరాలకు సంబంధించిన వ్యాధి వచ్చినప్పుడు చేతులు మొద్దుబారతాయి. దీంతో చేతుల్లో ఎవరో సూది గుచ్చుతున్నట్లు, కొన్నిసార్లు ఓ రకమైన భరించలేని నొప్పి ఉంటుంది. ఈ సమయంలో ఆలస్యం చేయకుండా మంచి డాక్టర్ని సంప్రదించాలని నిపుణులు చెబుతున్నారు.

మనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

 

The post Health Tips: చేతులు నిరంతరం జలదరింపుకు గురవుతున్నాయా? appeared first on Rtvlive.com.