పశ్చిమ బెంగాల్‌ రాజధాని కోలకతాలో జూనియర్ డాక్టర్‌ హత్యాచార ఘటనపై దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో దీనిపై సీఎం మమతా బెనర్జీ స్పందించారు. ఈ ఘటన దురదృష్టకరమని.. ఇలాంటి దారుణానికి పాల్పడిన ఆ నిందితుడిని ఉరి తీయాలన్నారు. దోషిని ఉరి తీస్తేనే దాని నుంచి ప్రజలు గుణపాఠం నేర్చుకుంటారని వ్యాఖ్యానించారు. అలాగే ఏ ఒక్క అమాయకుడిని శిక్షించకూడదని తెలిపారు. పోలీసుల విచారణలో బయటపడ్డ అంశాలకు సంబంధించి అన్ని పత్రాలు సీబీఐకి అప్పగించామని పేర్కొన్నారు.

Also Read: ఏపీ ప్రజలకు శుభవార్త.. ఆ రూట్‌లో విమాన సేవలు !

మరోవైపు కోల్‌కతా వైద్యురాలికి జరిగిన ఘటనపై పార్టీలకు అతీతంగా రాజకీయ నేతలు, ప్రజా సంఘాలు సహా అన్ని వర్గాల ప్రజలు ఖండిస్తున్నారు. వెంటనే నిందితుడిని కఠినంగా శిక్షించాలంటూ డిమాండ్ చేస్తున్నారు. విచారణలో ఆలస్యం జరగకుండా బాధితురాలి కుటుంబానికి త్వరగా న్యాయం చేయాలని కోరుతున్నారు. ఇదిలాఉండగా ఇప్పటికే ఈ దారుణానికి పాల్పడ్డ నిందితుడు సంజయ్ రాయ్‌ను పోలీసులు అరెస్టు చేశారు.

Also Read: కోల్‌కతా ట్రైనీ డాక్టర్‌ హత్యాచార కేసు.. అసలేం జరిగిందంటే?

The post Mamta Benarjee: వైద్యురాలి ఘటనపై స్పందించిన సీఎం మమతా బెనర్జీ.. ఏమన్నారంటే ? appeared first on Rtvlive.com.