• 8 అవార్డులు సాధించిన పృద్విరాజ్ సినిమా
  • బెస్ట్ యాక్టర్ గా పృద్విరాజ్ సుకుమారన్
  • బెస్ట్ డైరక్టర్ గా బ్లేస్సి

పృధ్వీరాజ్ సుకుమారన్ హీరోగా బ్లెస్సీ దర్శకత్వంలో గతేడాది వచ్చిన సినిమా ఆడు జీవితం. కేరళలో నజీజ్ అనే వ్యక్తి బ్రతుకు తెరువుకు గల్ఫ్ కంట్రి అయిన దుబాయ్ కి వెళ్ళినప్పుడు అక్కడ ఏం జరిగింది, అసలు నజీబ్ నజీబ్ తిరిగి కేరళ వచ్చాడా, దుబాయ్ లో ఎటువంటి దారుణ పరిస్థితులను ఎదురక్కోన్నాడు వంటి కథాంశంతో తెరకెక్కిన ఆడు జీవితం భాషతో సంభందం లేకుండా ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంది. 2023 కేరళ టాప్ గ్రాసర్ చిత్రాల సరసన నిలిచింది.

Also Read: New release: థియేట్రికల్ రిలీజ్ కు విభిన్న చిత్రాల దర్శకుడి సినిమా..

తాజాగా జరిగిన 54వ కేరళ స్టేట్ ఫిల్మ్ అవార్స్ కార్యక్రమంలో ఆడు జీవితం అదరగొట్టింది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 9 అవార్డులు దక్కించుకొని రికార్డ్స్ సృష్టించింది. ఎడారిలో దిక్కుచోతని స్థితిలో గొర్రెల కాపరిగా పృద్విరాజ్ నటన ప్రతీ ఒక్కరితో కంటతడి పెట్టించింది. అంతటి అద్భతమైన నటన కనబరిచినందుకు గాను కేరళ స్టేట్ ఫిల్మ్ బెస్ట్ యాక్టర్ అవార్డు అందుకున్నాడు పుృధ్విరాజ్ సుకుమారన్. అదే విధంగా కథలో ఎక్కడా సినిమాటిక్ లిబర్టీ తీసుకోకుండా, యాదార్ధంగా తెరకెక్కించినందుకు గాను బెస్ట్ డైరక్టర్ గా బ్లేస్సిని అవార్డు వరించింది. అంతే కాకుండా బెస్ట్ పాపులర్ ఫిల్మ్ విభాగంలోనూ ఆడు జీవితం అవార్డు సాధించింది. దాంతో పాటుగా బెస్ట్ స్కీన్ ప్లే, బెస్ట్ సినిమాటోగ్రఫీ, బెస్టే మేకప్ ఆర్టీస్ట్, బెస్ట్ సౌండ మిక్సింగ్ పాటు కేరళ ప్రభుత్వం ప్రత్యేకంగా అందించే స్పెషల్ జ్యూరి అవార్డును సైతం అందుకుంది ఆడు జీవితం. థియేటర్లలో సూపర్ హిట్ అయినా ఈ సినిమా ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ లో తెలుగులో కూడా స్ట్రీమింగ్ అవుతోంది