ఈ వార్తను అనువదించండి:

సీఎం రేవంత్ రెడ్డి: ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అవ్వబోతుందని ఆర్టీవీ ప్రసారం చేసిన కథనంపై ఆయన స్పందించారు. త్వరలో బీజేపీలో బీఆర్ఎస్ విలీనం జరుగుతుందన్నారు. కేసీఆర్ కు గవర్నర్, కేటీఆర్ కు కేంద్ర మంత్రి పదవి,  హరీష్ రావుకు అసెంబ్లీలో అపోజిషన్ లీడర్ పదవులు దక్కుతాయని అన్నారు. బీఆర్ఎస్ కు నలుగురు రాజ్యసభ సభ్యులు ఉన్నారని చెప్పారు. బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుల విలీనంతో లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టైన ఎమ్మెల్సీ కవితకు బెయిల్ వస్తుందని అన్నారు. నాలుగు రాజ్యసభ సీట్లకు సమానంగా కవితకు రాజ్యసభ పదవి వస్తుందని సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు దేశ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.

పూర్తిగా చదవండి..