ఈ వార్తను అనువదించండి:

జోగి రమేష్: చంద్రబాబు నివాసంపై దాడి కేసులో మాజీ మంత్రి జోగి రమేష్ ఈరోజు విచారణకు మంగళగిరి డీఎస్పీ ఆఫీస్‌కు వెళ్లనున్నారు. ఈ కేసుపై ఆయన్ను డీఎస్పీ విచారించనున్నారు. కాగా ఆగస్టు 11న విచారణకు హాజరుకావాలని జోగి రమేష్ కు డీఎస్పీ నోటిసులు పంపిన సంగతి తెలిసిందే. అయితే.. దాడి సమయంలో వినియోగించిన ముబైల్ ఫోన్, సిమ్ కార్డ్, వెహికల్ తీసుకొని విచారణకు హాజరు కావాలని జోగి రమేష్ కు నోటీసులు అందాయి. 2021 సెప్టెంబర్ 17న చంద్రబాబు నివాసంపై దాడి కేసులో మాజీ మంత్రి జోగి రమేష్ నిందితుడిగా ఉన్నారు. కాగా ఈ కేసులో తనను పోలీసులు అరెస్ట్ చేయకుండా ఉండేందుకు జోగి రమేష్ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.

పూర్తిగా చదవండి..