• రిలీజ్ అయిన వారానికే ఓటీటీలో స్ట్రీమింగ్
  • చిన్న సినిమాలుకు గడ్డు కాలం
  • కనీసం పట్టించుకోని ప్రేక్షకులు

రాను రాను చిన్న, మిడ్ రేంజ్ సినిమాల పరిస్థితి దారుణంగా మారుతోంది. స్టార్ హీరోల సినిమాలు,ప్యాన్ ఇండియా తరహా సినిమాలు అయితేనే థియేటర్లలో చూస్తున్నారు ఆడియన్స్. దీంతో మిడిల్ హీరోలు, చిన్న హీరోల పరిస్థితి ఘోరంగా మారింది. ఈ హీరోల సినిమాలు థియేటర్లలో విడుదల అయినా ప్రేక్షకాదరణ రాకపోవడంతో వెంటనే ఓటీటీల బాట పడుతున్నాయి. ఒక్కోసారి మంచి కథ, కథనం ఉన్న చిన్న సినిమాలు  కూడా సరైన పబ్లిసిటీ లేక థియేటర్లలో ఫ్లాప్స్ గా నిలుస్తున్నాయి.

Also Read: Nani: తన నెక్స్ట్ సినిమా ఏంటో చెప్పేసిన నాని.. దర్శకుడు ఎవరంటే..?

బిచ్చగాడు సినిమాతో టాలీవుడ్ లో విజయ్ ఆంటోనీ భారీ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. చిన్న సినిమాగా వచ్చి భారీ సంచలనం సృష్టించింది ఆ సినిమా. అప్పటినుండి వరుస డబ్బింగ్ సినిమాలతో  తెలుగు సినిమా ప్రేక్షకులను పలకరిస్తున్నాడు. కానీ హిట్టు మాత్రం దక్కలేదు. ఈ నేపథ్యంలో విజయ్  ఆంటోని హీరోగా ‘తుఫాన్’ అనే సినిమాతో ఆగస్టు 9 మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చాడు ఈ తమిళ హీరో. కనీసం పబ్లిసిటీ కూడా  లేకుండా వచ్చిన ఈ సినిమా థియేటర్లలో ఫ్లాప్ గా నిలిచింది. ఇప్పుడు ఈ సినిమా విడుదల అయిన వారానికే ఓటీటీలో ప్రత్యక్షం కావడం గమనార్హం.  థియేటర్లలో రిలీజ్ అయిన వారానికి ఇలా  ఓటీటీలోకి వచ్చింది అంటే ప్రేక్షకులు చిన్న తరహా సినిమాలు చూడడానికి  ఈ మేర ఆసక్తి చూపుతున్నారో తెలుస్తుంది.  కాగా ఈ విజయ్ ఆంటోని నటించిన ఈ  తుఫాన్ సినిమా అటు తమిళ్ లో ఆగస్టు 2న రిలీజ్ అయి ఫ్లాప్ అయింది. వారం గ్యాప్ లో తెలుగులో రిలీజ్ అయింది.