సిద్దిపేట: సిద్ధిపేట జిల్లా కేంద్రంలో శుక్రవారం అర్ధరాత్రి కాంగ్రెస్ కార్యకర్తలు హల్ చల్ చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు క్యాంపు ఆఫీసుపై దాడికి పాల్పడ్డారు. క్యాంప్‌ గేట్లు బద్ధలు కొట్టి ఫ్లెక్సీలు చించేసి హంగామా చేశారు. ఆఫీస్‌ పైకెక్కి హడావిడి చేసిన కాంగ్రెస్‌ కార్యకర్తలు.. జై కాంగ్రెస్‌, జైజై కాంగ్రెస్‌ అంటూ నినాదాలు చేశారు. కాంగ్రెస్ మాటతప్పకుండా రుణమాఫీ చేసినందుకు హరీష్‌రావు రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ కార్యకర్తలను అడ్డుకోవడానికి బీఆర్‌ఎస్‌ కార్యకర్తలు రావడంతో హరీష్‌ ఆఫీస్‌ దగ్గర అర్ధరాత్రి హైటెన్షన్‌ వాతావరణం నెలకొంది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు కాంగ్రెస్‌ కార్యకర్తలను బయటకు పంపించేశారు. ఆఫీస్‌పై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని బీఆర్‌ఎస్‌ నేతల డిమాండ్‌ చేస్తున్నారు.

The post Attack on Harish Rao office: సిద్ధిపేటలోఅర్ధరాత్రి హైడ్రామా.. హరీష్‌రావు ఆఫీస్‌పై దాడి! appeared first on Rtvlive.com.