కాలి పై భాగంలో నీలి సిరలను
పాదాల పై స్పైడర్ వెబ్ ఆకారంలో కనిపించే నీలి సిరులను ఎప్పుడూ తేలికగా తీసుకోవద్దు. ఈ సమస్య పాదాలతో పాటు కాలేయ అనారోగ్యాన్ని కూడా సూచిస్తుంది. కాలేయంలో ఈస్ట్రోజెన్ అధికంగా చేరడం వల్ల పాదాల పై నీలి సిరలు(veins) కనిపిస్తాయి. అధిక ఈస్ట్రోజెన్ లివర్ పనితీరును దెబ్బతీస్తుంది.
జలదరింపు , తిమ్మిరి
తరచుగా పాదాలలో జలదరింపు, మొద్దుబారినట్లుగా అనిపించడం విటమిన్ బి12 లోపాన్ని సూచిస్తుంది.
కాళ్ళలో నొప్పి
కాలి కండరాలలో నొప్పి, తిమ్మిరిని అనుభవించే వారికి మెగ్నీషియం లోపం ఉన్నట్లు సంకేతం. కాళ్ళలో ఈ రకమైన నొప్పిని నివారించడానికి మెగ్నీషియం సప్లిమెంట్లు అవసరం.
గాయాలు మానకపోవడం
పాదాలలో అయిన గాయాలు తేలికగా మానకపోవడం, అవి రక్తస్రావం జరుగుతుంది. ఈ పరిస్థితి శరీరంలో విటమిన్ కె లోపాన్ని సూచిస్తుంది.
పగిలిన మడమలు
పగిలిన మడమలు పోషకాహార లోపానికి సంకేతం. ఏడాది పొడవునా పాదాల మడమల పగుళ్లు … వాటిలో గాయాలు ఏర్పడడం విటమిన్ బి3 లోపాన్ని సూచిస్తుంది. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ కలిగిన ఆహారాలు తక్కువగా తీసుకోవడం ద్వారా ఈ సమస్య తలెత్తుతుంది. దీని కోసం చేపలు, నట్స్ వంటి ఆహారాలు తీసుకోవాలి.
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.
ఇది కూడా చదవండి: ఈ 7 టిప్స్ పాటిస్తే మీ ఆఫీస్ లో మీరే కింగ్.. అవేంటో ఓ లుక్కేయండి!
[vuukle]