Samantha: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత కొద్దిరోజులుగా సోషల్ మీడియా వార్తలలో నిలుస్తున్నారు అందుకు కారణం తన మాజీ భర్త నాగచైతన్య రెండో పెళ్లి చేసుకోబోతున్న నేపథ్యంలో ఈమె కూడా వార్తలలో నిలిచారు. అసలు సమంత నాగచైతన్య విడాకులు తీసుకోవడానికి కారణం ఏంటి అనే విషయాలు మరోసారి చర్చలకు కారణమయ్యాయి.

ఇలా వీరిద్దరు విడిపోవడానికి సమంత కారణమని ఒకానొక సమయంలో ఈమె పై ఎన్నో విమర్శలు వచ్చాయి కానీ సమంత ఇప్పటికీ నాగచైతన్య జ్ఞాపకాలలోనే ఉన్నారని, ఈయన మాత్రం ఇప్పుడు రెండో పెళ్లి చేసుకోవడానికి సిద్ధం కావడంతో ఎవరిది తప్పు అనే విషయం స్పష్టంగా తెలుస్తోంది . తాజాగా మరోసారి వీరి విడాకుల వార్తలు హల్చల్ చేస్తున్నాయి.

ఇకపోతే తాజాగా వీరిద్దరికి సంబంధించి ఒక వార్త వెలుగులోకి వచ్చింది. నిజానికి సమంత నాగచైతన్య ఇప్పటికే తల్లితండ్రులు కావాల్సి ఉండగా నాగచైతన్య సమంతతో బలవంతంగా తనకు అబార్షన్ చేయించారని తెలుస్తుంది. అప్పటికే నాగచైతన్య శోభిత ప్రేమలో ఉన్న నేపథ్యంలో పిల్లల పుడితే విడాకులకు కష్టమవుతుందని భావించి ఆమె చేత బలవంతంగా అబార్షన్ చేయించారని సమాచారం.

శోభిత కారణమా…
ఇలా సమంతకు అబార్షన్ చేయించారు అంటూ వార్తలు వస్తున్న తరుణంలో ప్రముఖ ఫిలిం క్రిటిక్ ఉమైర్ సందు సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ చేశారు. సమంత ప్రెగ్నెన్సీని నాగచైతన్య తీయించారని, నాగచైతన్య సమంతని చాలా టార్చర్ చేశాడని, ఆ టార్చర్ తట్టుకోలేకే సమంత విడాకులు ఇచ్చిందనే పోస్ట్ పెట్టాడు. అయితే తాజాగా నాగచైతన్య రెండో పెళ్లి మ్యాటర్ నెట్టింట్లో వైరల్ అవ్వడంతో శోభిత వల్లే సమంత ప్రెగ్నెన్సీ పోయిందని పలువురు ఈ విషయంపై కామెంట్లు చేస్తున్నారు.