Bigg Boss Beauty: సనమ్ శెట్టి సంచలనాలకు కాంట్రవర్సీలకు కేరాఫ్ అడ్రస్ అని చెప్పాలి. తమిళ నటి అయినటువంటి ఈమె ఎవరు ఏమనుకున్నా సరే .. ఉన్నది ఉన్నట్లు ముఖంపై కొట్టినట్లు మాట్లాడే ఈ అమ్మడు మీడియా ముందుకు వచ్చినా, సోషల్ మీడియా వేదికగా ఎలాంటి పోస్ట్ చేసిన పెద్ద ఎత్తున వివాదం అవుతుంది.

నాలుగేళ్ల క్రితం తనతో పాటు బిగ్‌బాస్ హౌస్‌లో ఉన్న నటుడు దర్శన్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు సనమ్. నీళ్లలో దిగి ఇంటర్వ్యూలు చేసే అమ్మాయిని ఎవరు పెళ్లి చేసుకుంటారు అంటూ సనమ్ ఆవేదన వ్యక్తం చేశారు ఇలా ఆయనతో పాటు కొన్ని రోజులు పాటు డేటింగ్ లో ఉన్నటువంటి ఈమె రహస్యంగా నిశ్చితార్థం చేసుకున్నారని కానీ అక్కడితోనే వీరికి బ్రేకప్ జరిగిందని తెలుస్తోంది.

ఇక ఈ విషయంపై కూడా దర్శన్ గతంలో వివరణ ఇచ్చారు. అయితే తాజాగా మరోసారి ఈమె సోషల్ మీడియా వేదికగా చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం సంచలనంగా మారాయి. వరలక్ష్మీ వ్రతం రోజు ఈమె ఈ వీడియోని షేర్ చేస్తూ..ఇవాళ మనం మహాలక్ష్మీ దేవి పూజను జరుపుకుంటున్నామని.. కానీ మధ్య నడిచే దేవతలు అత్యాచారానికి, హత్యలకు గురవుతారు.

క్లెయిమ్ ది నైట్..

ప్రాణాలను పోసే దేవదూత లాంటి జూనియర్ డాక్టర్ మౌమిత దేబ్‌నాథ్‌తను అనాగరికంగా హత్య చేస్తే.. కోల్‌కతాలో రీక్లెయిమ్ ది నైట్ అనే ఉద్యమాన్ని ప్రారంభించారు. నేను దానిని చెన్నైలో క్లెయిమ్ ది నైట్గా ప్రారంభించాలనుకుంటున్నా. నాతో కలిసి ఈ పోరాటంలో భాగం కావాలని తెలిపారు. ఇంతటితో ఆగకుండా.. అనుమతి లేకుండా ఒక ఆడపిల్లను టచ్ కూడా చేయకూడదు. తాను ఓ నటిని, ఎంటర్‌టైన్‌ చేయడమే నా వృత్తి అలాగని ఆఫర్ల కోసం శరీరాన్ని అమ్ముకోనని సనమ్ శెట్టి తేల్చిచెప్పారు. ప్రస్తుతం ఆమె చేసిన ఈ కామెంట్స్ సంచలనంగా మారాయి.