• నార్నె నితిన్ రెండవ సినిమా ఆయ్
  • వరుస హిట్లు కొడుతున్న నార్నె నితిన్
  • భారీ కలెక్షన్స్ సాధిస్తున్న ఆయ్

ఆగస్టు 15న రిలీజ్ అయిన సినిమాలలో చిన్న సినిమాగా రిలీజ్ కాబడి పెద్ద హిట్ సాధించిన చిత్రం ‘ఆయ్ మేము ఫ్రెండ్సండి’. జూనియర్ ఎన్టీయార్ బావమరిది నార్నె నితిన్ హీరోగా అంజి కె మణిపుత్ర దర్శకత్వంలో, గీత ఆర్ట్స్ -2 బ్యానర్ పై బన్నీ వాసు ఈ చిత్రాన్ని నిర్మించాడు. ముగ్గురు స్నేహితుల మధ్య సరదాగా సాగె కథకు కుటుంబ నేపధ్యాన్ని జోడించి తెరకెక్కించిన విధానం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది.

Also Read: Devara: దేవర ఓవర్సీస్ రైట్స్ దక్కించుకున్న ప్రముఖ సంస్థ..

భారీ సినిమాల మధ్య పోటీగా రిలీజైన ఆయ్ సూపర్ హిట్ మౌత్ టాక్ తో మొదటి రోజు కంటే రెండవ రోజు ఎక్కువ వసూళ్లు రాబట్టింది. చిన్న సెంటర్, పెద్ద సెంటర్ అనే తేడా లేకుండా మంచి కలెక్షన్స్ సాధించింది. కాగా ఈ చిత్ర దర్శకుడు అంజి కె మణిపుత్రకు అనుకోని సంఘటన ఎదురైంది. ఈ శనివారం దర్శకుడు సినిమా చూసేందుకు హైదరాబాద్ లోని ప్రముఖ మల్టీప్లెక్స్ AMB సినిమాస్ కు వెళ్లగా అప్పటికే థియేటర్ హౌస్ ఫుల్ అయింది, టికెట్స్ లేవని చెప్పడంతో నిరాశతో వెనుదిరుగుతూ బన్నీ వాసు గారు చూసారా మన ఆయ మూవీ బాగా ఆడుతుంది, మీరేమో థియేటర్స్ పెంచండి అంటే పెంచట్లేదు, డైరెక్టర్ కి కూడా టికెట్స్ లేవు ఇక్కడ అని సరదగా ఆనందంతో వీడియో రికార్డు చేసి నిర్మాత బన్నీవాసుని ట్యాగ్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. బాగుందనే టాక్ రావడం, వీకెండ్ కావడంతో ఆయ్ టికెట్స్ కు డిమాండ్ ఏర్పడింది.