Sobhita: అక్కినేని నాగచైతన్య ఇటీవల సమంతకు విడాకులు ఇచ్చిన తర్వాత నటి శోభిత ధూళిపాళ్లతో నిశ్చితార్థం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇలా వీరిద్దరు గత కొంతకాలంగా ప్రేమలో ఉన్నారని, పెద్దల సమక్షంలో వీరిద్దరు వివాహం చేసుకోబోతున్నారని తెలుస్తుంది. ఇక నిశ్చితార్థపు ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ తరుణంలోనే శోభితకు సంబంధించి ఎన్నో వార్తలు హల్చల్ చేస్తున్నాయి.

అక్కినేని ఇంటికి కోడలు కాబోయే శోభితకు అతిపెద్ద సవాల్ ఎదురు కాబోతుందని దానిని ఈమె చేదించగలరా అనే సందేహం అందరిలోనూ కలుగుతుంది. ఇక శోభిత ముందున్న చాలెంజ్ ఏంటి అనే విషయానికి వస్తే.. తన అత్తయ్య అమల మాదిరి అక్కినేని బరువు బాధ్యతలను విజయవంతంగా ముందుకు నడిపించగలదా? అక్కినేని కుటుంబం కోసం సినిమాలను త్యాగం చేయగలదా? అనే అంశాలు ఈమె ముందు ఉన్నాయి.

నాగార్జున కూడా అమలను రెండవ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈమె కూడా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ అయితే నాగార్జునని పెళ్లి చేసుకున్న తర్వాత కుటుంబ బాధ్యతలను నిర్వర్తించడం కోసం ఈమె తన కెరియర్ ను త్యాగం చేసేసారు. తన అమల మాదిరిగా శోభిత కూడా కుటుంబం కోసం తన కెరియర్ పక్కన పెట్టేస్తారా అన్నదే పెద్ద సందేహంగా మారింది.

అత్త అమల బాటలో..
ఇకపోతే గతంలో కూడా సమంత స్టార్ హీరోయిన్గా కొనసాగిన తనకు సినిమాల పరంగా ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చారు. ఇలా సినిమాలలో తనకు ఫ్రీడం ఇవ్వటం వల్లే సమంత నాగచైతన్య విడిపోయే పరిస్థితి వచ్చింది మరి అదే పరిస్థితి శోభితకు ఎదురవుతుందా లేకపోతే ఈమె తన అత్త అమల బాటలో పయనిస్తుందా అనేది తెలియాల్సి ఉంది.