Lavanya Tripati: సినీనటి లావణ్య త్రిపాఠి మెగా ఇంటి కోడలుగా అడుగు పెట్టిన సంగతి మనకు తెలిసిందే .అందాల రాక్షసి సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకుల ముందుకు హీరోయిన్గా పరిచయమైన ఈమె అనంతరం తెలుగులో వరుస సినిమాలలో నటించారు. ఇలా పలు సినిమాలలో నటిస్తున్నటువంటి లావణ్య త్రిపాఠి మెగా హీరో వరుణ్ తేజ్ ప్రేమలో పడ్డారు వీరిద్దరూ కలిసి మిస్టర్, అంతరిక్షం సినిమాలో నటించారు.

ఈ విధంగా పలు సినిమాలలో నటించిన వీరిద్దరూ రహస్యంగా ప్రేమలో పడ్డారు. ఇక కుటుంబ సభ్యుల సమక్షంలో వీరిద్దరూ ప్రేమ వివాహం చేసుకున్నారు. పెళ్లి తర్వాత లావణ్య త్రిపాటి ఎలాంటి సినిమాలకు కమిట్ అవ్వలేదు అయితే తాజాగా లావణ్య త్రిపాటికి సంబంధించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈమె మెగా కుటుంబానికి దూరం కాబోతోంది అంటూ ఓ వార్త వైరల్ గా మారడంతో అభిమానులు కాస్త ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఈమె మెగా కుటుంబానికి దూరం కాబోతున్నారు అంటూ పూర్తిగా ఈ కుటుంబంతో సంబంధాలు తెంచుకొని వెళ్ళిపోతున్నారని కాదండోయ్ ఈమె త్వరలోనే తల్లి కాబోతుంది అంటూ ఒక వార్త వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. ఇలా తల్లి కాబోతున్నటువంటి ఈమె తన తల్లి గారి ఇంటికి వెళ్లబోతున్నారని సమాచారం.

తల్లి కాబోతున్న లావణ్య..
ఇప్పటివరకు లావణ్య త్రిపాటి తల్లి కాబోతుందంటూ వార్తలు వస్తున్నాయి కానీ ఈ వార్తల పై ఎలాంటి అధికారక ప్రకటన వెల్లడించలేదు అయితే త్వరలోనే ఈ విషయాన్ని వరుణ్ తేజ్ తెలియచేయబోతున్నారని సమాచారం. ఇప్పటికే రామ్ చరణ్ కు కూతురు పుట్టిన సంగతి తెలిసిందే. త్వరలోనే మరో బుల్లి వారసుడు లేదా వారసురాలు రాబోతున్నారని వార్తలు వైరల్ గా మారడంతో మెగా అభిమానులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.