Harish Shankar Clarity on Issues With Trivikram: రవితేజ హీరోగా హరీష్ శంకర్ మిస్టర్ బచ్చన్ అనే సినిమా చేశాడు. ఆగస్టు 15 ఇండిపెండెన్స్ డే సందర్భంగా రిలీజ్ అయిన ఈ సినిమాకి మిక్స్డ్ టాక్ వచ్చింది. అయితే ఇంకా సినిమా ప్రమోషన్స్ మాత్రం హరీష్ శంకర్ ఆపలేదు. తాజాగా అభిమానులతో చిట్ చాట్ చేసిన ఒక వీడియోని టీం రిలీజ్ చేసింది. ఈ సందర్భంగా త్రివిక్రమ్ తో మీకు గొడవలు ఉన్నాయట నిజమేనా? అని ఒక అభిమాని అడిగితే దానికి హరీష్ శంకర్ స్పందించాడు. చాలామంది ఆర్టికల్స్ రాసిన విషయం నా దృష్టికి కూడా వచ్చింది కానీ నిజానికి నేను అసిస్టెంట్ డైరెక్టర్గా మారడానికి ముందే త్రివిక్రమ్ రైటర్ గా నాలుగు ఐదు నంది అవార్డులు అందుకున్నాడు. డైలాగ్స్ అనే వాటికి నాకు సపరేట్గా ఫ్యాషన్ ఉండేది. అలాగే నేను అసిస్టెంట్ డైరెక్టర్ అవ్వక ముందు నుంచి త్రివిక్రమ్ గారి డైలాగ్స్ అంటే చాలా ఇష్టం. నా కంటే చాలా సీనియర్ ఆయన. ఇవన్నీ కాకుండా ఇంకొక పెద్ద విషయం ఏమిటంటే ఇప్పటివరకు నేను ఈ విషయం ఎక్కడా చెప్పలేదు. ఎందుకంటే ఎవరు అడగలేదు కాబట్టి. మా నాన్నగారు త్రివిక్రమ్ గారికి చాలా పెద్ద అభిమాని.

Ruhani Sharma: వామ్మో, రుహానీ ఏంటి ఇలా చేసింది.. వీడియోలు వైరల్!

ఎంత పెద్ద అభిమాని అంటే అతడు సినిమా అయినా కొన్ని వందల సార్లు చూసుంటాడు. మా ఇంట్లో ఒకరకంగా త్రివిక్రమ్ గారే పెద్దబ్బాయి. అన్నయ్య బాగా చదువుతున్నాడు నువ్వేంటి రా అని ఇంట్లో చిన్నవాడిని అడిగినట్టు నా సినిమాల్లో ఏవైనా కమర్షియల్ ఎలిమెంట్స్ ఎక్కువైపోయినప్పుడు త్రివిక్రమ్ గారి సినిమా చూడరా అని చూపించేవారు. మా నాన్నగారికి త్రివిక్రమ్ అంటే అంత ఇష్టం మా నాన్నగారి ఇష్టం నాకు ఏ రేంజ్ లో కోపం తెప్పించింది అంటే ఇక నేను కూడా త్రివిక్రమ్ గారి ఫాదర్ దగ్గరికి వెళ్లి ఆయనకు నా సినిమాలన్నీ చూపించి సార్ మీరు నా ఫ్యాన్ అని చెప్పండి. త్రివిక్రమ్ గారు మా ఇంట్లో పెద్ద కొడుక, నేను మీ ఇంట్లో చిన్న కొడుకు అనుకోండి అని చెబుదామనుకున్నాను. త్రివిక్రమ్ గారు అంటే నాకు అంత రెస్పెక్ట్. సోషల్ మీడియాలో వచ్చే ట్రోల్స్, టార్గెట్స్ ఇవన్నీ మనం చూసి నవ్వుకోవాలి. నో డౌట్ తెలుగు సినిమా చరిత్రలో ఒక రైటర్ గా త్రివిక్రమ్ గారు వేసిన ముద్ర శాశ్వతం. ఎప్పటికీ ఆ ముద్ర ఉంటుంది అని చెప్పుకొచ్చారు.