Jani Master: డాన్స్ కొరియోగ్రాఫర్ గా ఇండస్ట్రీలో మంచి సక్సెస్ అందుకున్న వారిలో జానీ మాస్టర్ ఒకరు. ఈయన ఇటీవల 71 జాతీయ చలనచిత్ర అవార్డుల జాబితాలో భాగంగా ఉత్తమ కొరియోగ్రాఫర్ గా ఈ అవార్డుకు ఎంపికైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఇతర కొరియోగ్రాఫర్లు పెద్ద ఎత్తున ఈయనకు సన్మానం చేశారు.

ఇటీవల ప్రకటించిన 70వ నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్‌లో తిరుచిత్రాంబలం (తెలుగులో తిరు) సినిమాలోని మేఘం కరుగత పాటకు జానీ మాస్టర్, సతీష్ కృష్ణన్ బెస్ట్ కొరియోగ్రాఫర్ అవార్డ్ అందుకోబోతున్న తరుణంలో హైదరాబాదులో వీరిని ఘనంగా సత్కరించారు.ఈ కార్యక్రమంలో డ్యాన్సర్స్ అసోసియేషన్ నాయకులు, తెలుగు ఫిలిం ఫెడరేషన్ అధ్యక్షులు అనిల్ కుమార్ వల్లభనేని, ఫిలింఛాంబర్ ప్రెసిడెంట్ భరత్ భూషణ్, నిర్మాతలు ప్రసన్నకుమార్, దామోదర ప్రసాద్, శేఖర్ మాస్టర్ తదితరులు పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో భాగంగా శేఖర్ మాస్టర్ చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.నేను, గణేష్, జానీ దాదాపు ఒకేసారి కెరీర్ స్టార్ట్ చేశాం. ఈరోజు జానీ మాస్టర్‌కు నేషనల్ అవార్డ్ రావడం చాలా సంతోషాన్ని కలిగిస్తోంది. మా అందరికీ ఆ అవార్డ్ వచ్చినట్లు ఆనందిస్తున్నాం. గతంలో నార్త్‌కు కొరియోగ్రఫీలో నేషనల్ అవార్డ్స్ వచ్చేవి ఇప్పుడు మనకు వస్తున్నాయని ఈయన తెలిపారు.

నిర్మాతలే హీరోలు..
ఇక జానీ మాస్టర్ సైతం ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ పలు విషయాలు వెల్లడించారు. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ప్రతి ఒక్కరికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు..మీడియా మిత్రులు మమ్మల్ని ఎప్పుడూ బాగా సపోర్ట్ చేస్తుంటారు. సినిమాకు ఆది, అంతం నిర్మాతే. ఆయన లేకుంటే హీరోలు కూడా లేరు. నిర్మాతలను మనం ఒక డబ్బులు పెట్టే వ్యక్తిగా మాత్రమే చూస్తున్నాము కాని నిజానికి వాళ్లే హీరోలు అంటూ ఈ సందర్భంగా జానీ మాస్టర్ కామెంట్స్ చేశారు.