ఈ వార్తను అనువదించండి:

తెలంగాణ: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్, బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. తెలంగాణ సెక్రెటేరియట్ ముందు రాజీవ్ గాంధీ విగ్రహం పెడితే భవిష్యత్తులో కూల్చివేస్తామంటూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై సీఎం రేవంత్ ఘాటుగా స్పందించారు. బీఆరెస్ నేతలకు అధికారం పోయినా బలుపు తగ్గలేదని రేవంత్ అన్నారు. సెక్రటేరియట్ ముందు కేటీఆర్ వాళ్ల అయ్య విగ్రహం పెట్టుకుందామనుకుంటున్నారు. కానీ సచివాలయం ముందు ఉండాల్సింది ఉద్యమం ముసుగులో తెలంగాణను దోచుకున్న వాళ్ల విగ్రహం కాదని చెప్పారు. సచివాలయం ముందు దొంగలకు, తాగుబోతులకు స్థానం లేదని, అధికారంలోకి వస్తే రాజీవ్ విగ్రహాన్ని తొలగిస్తామని మాట్లాడుతున్నారని మండిపడ్డారు. చేతనైతే ఎవడైనా విగ్రహం మీద చేయి వేయాలంటూ సీఎ రేవంత్ సవాల్ చేశారు.

పూర్తిగా చదవండి..