Janhvi Kapoor: దివంగత నటి శ్రీదేవి వారసురాలుగా ఇండస్ట్రీలోకి తన కుమార్తె జాన్వీ కపూర్ అడుగుపెట్టి తన స్వసక్తితో సినిమా అవకాశాలను అందుకుంటూ కెరియర్ పరంగా బిజీగా ఉన్నారు. ఒకప్పుడు బాలీవుడ్ సినిమాలకు మాత్రమే పరిమితం అయిన ఈమె ప్రస్తుతం టాలీవుడ్ సినిమాలలో కూడా నటించే అవకాశాన్ని అందుకుంటున్నారు. త్వరలోనే దేవర సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు..

ఇక ఈ సినిమాతో పాటు రామ్ చరణ్ బుచ్చిబాబు కాంబినేషన్లో రాబోతున్న సినిమాకు కూడా ఈమె ఎంపిక అయ్యారు. ఇలా వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా బిజీగా ఉన్న జాన్వి కపూర్ తాజాగా ఓ ఖరీదైన కారును కొనుగోలు చేశారు అయితే ఈమె కొనుగోలు చేసిన ఈ కారు బాలీవుడ్ ఇండస్ట్రీలో ఏ హీరోయిన్ వద్ద లేదని కేవలం రణబీర్ కపూర్ వద్ద మాత్రమే ఉందని తెలుస్తోంది.

మరి ఈమె కొనుగోలు చేసిన ఆ కారు ఏంటి దాని ధర ఎంత అనే విషయానికి వస్తే..జాన్వీ కపూర్ కొన్న ఆ కారు LEXUS LM -350 కారును సైతం కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఈ కార్ ధర విషయానికి వస్తే , దీని ధర ఎక్స్ షోరూం విలువ అక్షరాలా రూ.2.50 కోట్ల రూపాయలని తెలుస్తోంది అయితే దీనికి ఫిట్టింగ్ రిజిస్ట్రేషన్ తో కలిపి సుమారు మూడు కోట్ల వరకు ధర పలుకుతుందని తెలుస్తోంది.

మూడు కోట్ల విలువైన కారు..
ఇక ఈ కారు అత్యాధునిక ఫీచర్స్ తో అందుబాటులోకి వచ్చింది.ఇందులోని సీట్లు కూడా చాలా మసాజింగ్ టైపు గా కలిగి ఉంటాయట, అంతేకాకుండా టీవీ చూడడానికి కూడా సీటుకు ప్రత్యేకమైన సిస్టంని అమర్చారట. అలాగే సన్ లైట్ పడడానికి కూడా ఒక ప్రత్యేకమైన సెటప్ ని ఈ కారులో అమర్చారని ఇలా ఎన్నో రకాల సరికొత్త ఫీచర్స్ ఉండటం వల్లే ఈ కారు ఖరీదు ఎక్కువ అని తెలుస్తోంది.