• బెంగాలీ సినీ పరిశ్రమలో విషాదం
  • సీనియర్‌ దర్శకుడు చక్రవర్తి కన్నుమూత
  • సీఎం మమతా బెనర్జీ సంతాపం

Bengali Director Utpalendu Chakraborty Passed Away: ప్రముఖ బెంగాలీ దర్శకుడు ఉత్పలేందు చక్రవర్తి కన్నుమూశారు. ఆయన వయసు 76 ఏళ్లు. మంగళవారం సాయంత్రం 6 గంటలకు కోల్‌కతా రీజెంట్ పార్క్‌లోని తన నివాసంలో గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. చక్రవర్తికి భార్య సతరూప సన్యాల్‌.. ఇద్దరు కుమార్తెలు రీతాభరి, చిత్రాంగద ఉన్నారు. చక్రవర్తికి భార్య సతరూప సన్యాల్‌ చలనచిత్ర నిర్మాత. ఆయన మృతికి బెంగాలీ నటీనటులు సంతాపం ప్రకటిస్తున్నారు.

1983లో చోఖ్ చిత్రానికి ఉత్తమ చలనచిత్రం, ఉత్తమ దర్శకుడిగా ఉత్పలేందు చక్రవర్తి జాతీయ అవార్డును అందుకున్నారు. 1981లో తన తొలి చిత్రానికు ఇందిరా గాంధీ అవార్డు వరించింది. మోయన్‌తాడంటో (1980), చందనీర్ (1989), ఫాన్సి (1988), దేబ్‌శిశు (1987) చిత్రాలతో సినీ అభిమానుల హృదయాల్లో చెరగని ముద్రవేశారు. స్కాటిష్ చర్చి కళాశాల, కలకత్త విశ్వవిద్యాలయాల్లో చక్రవర్తి చదివారు. సత్యజిత్ రే, రవీంద్ర సంగీత్‌, దేబబ్రత బిస్వాస్ డాక్యుమెంటరీలను కూడా రూపొందించారు.

Also Read: Prabhas: ప్రభాస్‌ది వేరే లెవెల్.. నీలాంటి వాడు చేసే ఛీప్ కామెంట్స్‌ను పట్టించుకోరు: సుధీర్ బాబు

ఉత్పలేందు చక్రవర్తి గత కొద్ది సంవత్సరాలుగా సీవోపీడీతో బాధపడుతున్నారు. గత ఏప్రిల్‌లో బాత్రూంలో పడిపోవడంతో ఫ్రాక్చర్ అయింది. దానికి ఆయన సర్జరీ చేయించుకున్నారు. అంతా బాగుందనుకున్న సమయంలో గుండెపోటుతో మరణించారు. ఉత్పలేందు చక్రవర్తి మృతికి పశ్చిమ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ సంతాపం వ్యక్తం చేశారు. ఆయన మృతి సినీ పరిశ్రమలో తీరని లోటని పేర్కొన్నారు.