Bigg Boss 8: బిగ్ బాస్ సీజన్ 8 కార్యక్రమం కోసం అభిమానులందరూ ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. ఇలా బిగ్ బాస్ కార్యక్రమాల ద్వారా ఎంతోమంది హౌస్ లోకి అడుగుపెట్టి మంచి సక్సెస్ అందుకున్నారు. ఇలా ఏడు సీజన్లను ఎంతో విజయవంతంగా పూర్తి చేసుకుని ఎనిమిదవ సీజన్ ప్రసారానికి సిద్ధమవుతుంది. ఇప్పటికే ఈ కార్యక్రమం పై భారీ స్థాయిలో అంచనాలు కూడా పెరిగిపోయాయి.

ఇదిలా ఉండగా ఈ కార్యక్రమం నిర్వహణ కోసం ఏర్పాట్లు కూడా పూర్తి అయ్యాయని అలాగే కంటెస్టెంట్ ల ఎంపిక ప్రక్రియ కూడా పూర్తి అయ్యిందని తెలుస్తుంది. ఇకపోతే ఈ కార్యక్రమం ప్రసారపు తేదీ గురించి ఇప్పటివరకు బిగ్ బాస్ నిర్వాహకులు ఏ విధమైనటువంటి అధికారిక ప్రకటన వెల్లడించలేదు దీంతో ఈ కార్యక్రమం సెప్టెంబర్ ఒకటో తేదీ ప్రారంభమవుతుంది లేదా 8వ తేదీ ప్రారంభమవుతుంది అంటూ ఎన్నో వార్తలు హల్చల్ చేశాయి.

ఇక బిగ్ బాస్ ప్రసారపు తేదీ గురించి వస్తున్న వార్తలను నిర్వాహకులు తిప్పికొడుతూ ఈ కార్యక్రమం ప్రసారపు తేదీని అధికారకంగా ప్రకటించారు. ఈ కార్యక్రమం సెప్టెంబర్ ఒకటవ తేదీ ఎంతో ఘనంగా ప్రారంభం కాబోతుందని తెలియజేశారు. అంతేకాకుండా ఈ కార్యక్రమం గ్రాండ్ ఫినాలే కూడా ఎప్పుడనే విషయాన్ని ఈ సందర్భంగా వెల్లడించారు.

సెప్టెంబర్ ఒకటవ తేదీ ఈ కార్యక్రమం ఎంతో ఘనంగా ప్రారంభం కాగా డిసెంబర్ 8వ తేదీ గ్రాండ్ ఫినాలేని కూడా ఘనంగా జరుపుకొని బిగ్ బాస్ 8కార్యక్రమానికి ముగింపు పలకబోతున్నారని తెలుస్తోంది. ఇలా ఈ కార్యక్రమం గురించి పూర్తి సమాచారాన్ని అధికారికంగా ప్రకటించడంతో అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ కార్యక్రమంలో పాల్గొనబోయే కంటెస్టెంట్ల విషయంలో ఇప్పటికీ ఎన్నో వార్తలు వస్తున్నాయి.

ఇప్పటికే పలువురు బుల్లితెర నటీనటులు అలాగే జబర్దస్త్ కమెడియన్లతో పాటు సోషల్ మీడియా స్టార్స్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు అంటూ ఎంతో మంది పేర్లు వినపడుతున్నాయి. కానీ ఇప్పటికీ ఏవి మనకు అధికారికంగా వెల్లడించలేదు. అలాగే బిగ్ బాస్ నిబంధనల ప్రకారం కంటెస్టెంట్ల లిస్ట్ ముందుగా విడుదల చేయకూడదు కనుక కంటెంట్లను కూడా ఈ కార్యక్రమం ప్రసారపు తేదీన స్వయంగా నాగార్జున హౌస్ లోకి పంపించబోతున్నట్టు తెలుస్తుంది.