Revanth Reddy: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ క్షత్రియ సేవా సమితి ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అభినందన సభ జరిగిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి రేవంత్ రెడ్డి క్షత్రియుల గురించి ఎంత గొప్పగా మాట్లాడారు. అలాగే కృష్ణంరాజు ప్రభాస్ గురించి అలాగే రాంగోపాల్ వర్మ గురించి కూడా ఈయన మాట్లాడారు కృష్ణంరాజు గారి గురించి మాట్లాడకుండా తెలుగు సినిమాల గురించి మాట్లాడలేమని కొనియాడారు.

ఇక కృష్ణంరాజు వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ప్రభాస్ గురించి కూడా ఎంతో గొప్పగా మాట్లాడారు ప్రభాస్ లేకపోతే బాహుబలి సినిమానే లేదని ప్రభాస్ కి హాలీవుడ్ రేంజ్ ఉంది అంటూ రేవంత్ రెడ్డి ప్రభాస్ గొప్పతనం గురించి మాట్లాడటంతో అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఇక ఈ కార్యక్రమానికి ప్రభాస్ పెద్దమ్మ శ్యామల దేవి కూడా హాజరయ్యారు. ఇక సీఎం రేవంత్ రెడ్డి కృష్ణంరాజు గురించి ప్రభాస్ గురించి గొప్పగా మాట్లాడటంతో ఆమె ఎంతో సంతోషం వ్యక్తం చేశారు. అనంతరం ఈ కార్యక్రమంలో భాగంగా ప్రభాస్ పెద్దమ్మ శ్యామలాదేవి సీఎం రేవంత్ రెడ్డికి ఊహించని విధంగా ఒక కానుక అందజేశారు.

బాహుబలి కాజా..

ఈ కార్యక్రమంలో భాగంగా శ్యామలాదేవి సీఎం రేవంత్ రెడ్డిని కలిసి తాపేశ్వరం సురుచి నుంచి తెప్పించిన బాహుబలి కాజాను సీఎం రేవంత్ రెడ్డికి అందజేసి అందర్నీ ఆశ్చర్యానికి గురి చేశారు. ఇందుకు సంబంధించిన ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దీనిపై ప్రభాస్ అభిమానులు వివిధ రకాలుగా కామెంట్లు చేస్తున్నారు.