• వరుస హిట్స్ కొడుతున్న యంగ్ హీరో
  • బావ సూచనలు బావమరిది సంచలనాలు
  • హ్యాట్రిక్ పై కన్నేసిన హిట్ సినిమాల హీరో

చిత్ర పరిశ్రమలోకి ఎన్టీఆర్ బావమరిదిగా ఎంట్రీ ఇచ్చిన నార్నె నితిన్… వరుస హిట్లతో దూసుకుపోతున్నారు.
మ్యాడ్, ఆయ్ లాంటి యూత్ ఫుల్ ఎంటర్టైనర్ చిత్రాల హిట్స్ తో యూత్ లో క్రేజ్ తెచ్చుకున్నాడు నార్నె నితిన్. ఇదే ఊపుతో ఇప్పుడు హ్యాట్రిక్ పై కన్నేశారు. జాతీయ అవార్డు విన్నర్ , “శతమానం భవతి” దర్శకులు సతీష్ వేగేశ్న దర్శకత్వంలో తాజాగా ‘శ్రీ శ్రీ శ్రీ రాజావారు’ చిత్రంలో నటిస్తున్నారు. ఆయన సరసన సంపద హీరోయిన్ గా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని శ్రీ వేధాక్షర మూవీస్ పతాకంపై చింతపల్లి రామారావు నిర్మించారు. అన్నికమర్షియల్ ఎలిమెంట్స్ తో యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రం దసరా కానుకగా ప్రేక్షకులకు ముందుకు రానుంది.

Also Read: Mega Star : చిరంజీవి ఐ అండ్ బ్ల‌డ్ సెంటర్ కి క‌ళ్లను దానం చేసిన ముర‌ళీ మోహ‌న్..?

ఈ సందర్భంగా నిర్మాత చింతపల్లి రామారావు మాట్లాడుతూ ” మా చిత్ర హీరో నార్నె నితిన్ ఇటీవల మంచి ఫీల్ గుడ్, యూత్ ఫుల్ ఎంటర్టైనర్ మూవీస్ తో వరుస విజయాలు అందుకుంటున్నారు. వీటికి భిన్నంగా మా సినిమా వుంటుంది. పూర్తి కమర్షియల్ ఫార్మాట్ లో భారీ తారాగణంతోతెరకెక్కించారు దర్శకుడు సతీష్ వేగేశ్న, నితిన్ బావ జూనియర్ ఎన్టీఆర్ ఎంతో మెచ్చి ఈ కథను ఎంపిక చేశారు. ఆయన అంచనాల మేరకు దర్శకుడు సతీష్ వేగేశ్న ఈ చిత్రాన్ని ఎక్కడా రాజీపడకుండా తెరకెక్కించారు. కచ్చితంగా ఈ దసరాకి నార్నె నితిన్ ఖాతాలో ఆయ్ , మ్యాడ్ తరహాలో హ్యాట్రిక్ హిట్ పడుతుందని గట్టిగా నమ్ముతున్నాం. అని అన్నారు. ఈ చిత్రంలో రావు రమేష్, నరేష్, రఘు కుంచె, ప్రవీణ్, రచ్చ రవి, సరయు, రమ్య, ప్రియ మాచిరాజు, భద్రం, ఆనంద్, జబర్దస్త్ నాగి తదితరులు ఇతర పాత్రల్లో నటించగా కైలాష్ మీనన్ సంగీతం అందిస్తున్నారు.