ఈ వార్తను అనువదించండి:

తెలంగాణ: తెలంగాణలో రుణమాఫీ కాని రైతుల కోసం రేవంత్ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికి మూడు దశల్లో రెండు లక్షల లోపు రుణమాఫి చేసినప్పటికీ సాకేంతిక లోపం, పలు కారణాలతో చాలామందికి రుణమాఫీ కాలేదు. దీంతో ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతుండటంతోపాటు రెండు లక్షలు దాటిన రైతులు తమ పరిస్థితి ఏమిటని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే పెండింగ్ రుణమాఫీలపై చర్యలు చేపట్టిన రేవంత్ ప్రభుత్వం.. రాష్ట్రవ్యాప్తంగా అన్ని మండలాల్లో ప్రత్యేక నోడల్ అధికారుల నియామకం చేపట్టనున్నట్లు తెలిపింది. ఇవాళ్టి నుంచే మండల వ్యవసాయ అధికారి ఆఫీసుతో పాటు రైతు వేదికల్లో ఫిర్యాదులు స్వీకరిచాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది.

పూర్తిగా చదవండి..