వైవీ సుబ్బారెడ్డి: వెలిగొండ‌ ప్రాజెక్టుపై ప్రభుత్వం దిగ‌జారుడు వ్యాఖ్యలు చేస్తుంద‌ని వైసీపీ రీజ‌న‌ల్ కో-ఆర్డినేట‌ర్‌, ఎంపీ వైవీ సుబ్బారెడ్డి మండిప‌డ్డారు. వెలిగొండ ప్రాజెక్టును ఎవ‌రు పూర్తి చేశార‌న్నేది ప్రజ‌ల‌ందరికి తెలుసు అన్నారు. ఈ క్రమంలోనే ఆయన మాట్లాడుతూ..సార్వత్రిక ఎన్నిక‌ల్లో EVMల‌పై తమ‌కు మొద‌టి నుంచి అనుమానం ఉంద‌న్నారు.

Also Read:  ‘మా నాన్నను జైల్లో వేయండి’.. ఓ ఐదేళ్ల బుడ్డోడి ఫిర్యాదు..!

ఈవీఎంల‌పై గ‌తంలో టీడీపీ అధినేత చంద్రబాబు అనుమానం వ్యక్తం చేశార‌ని వైవీ సుబ్బారెడ్డి గుర్తు చేశారు. 2019లో టీడీపీ ఓట‌మి త‌రువాత ఈవీఎంల‌పై చంద్రబాబు మాట్లాడార‌న్నారు. ఈ క్రమంలోనే ఈవీఎంల‌పై తాము న్యాయ‌స్థానాన్ని ఆశ్రయించామ‌న్నారు. కోర్టులో తమకు న్యాయం జ‌రుగుతుంద‌నే న‌మ్మకం ఉంద‌ని అన్నారు.

The post AP: వెలిగొండ‌ ప్రాజెక్టుపై ప్రభుత్వం దిగ‌జారుడు వ్యాఖ్యలు: వైవీ సుబ్బారెడ్డి appeared first on Rtvlive.com.