ఈ వార్తను అనువదించండి:

Akkineni Nagarjuna: హైదరాబాద్‌లో గత ప్రభుత్వ మద్దతుగా సాగిన అక్రమ కట్టడాల మీద స్పెషల్ ఫోకస్ పెట్టింది హైడ్రా. గత కొన్ని రోజులుగా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఆక్రమణలను తొలగించేందుకు ఏర్పాటు చేసిన హైడ్రా వింగ్‌ దూకుడుగా వ్యవహరిస్తోంది. అక్రమ కట్టడాలను గుర్తించి వెంటనే కూల్చివేస్తోంది. తాజాగా కేటీఆర్‌కు చెందినదిగా భావిస్తున్న జవ్వాడ ఫామ్ హౌస్ అక్రమం అంటూ కూల్చివేయడానికి రంగం సిద్ధమైంది. అయితే దీనికి వ్యతిరేకంగా కోర్టుకు వెళ్లడం కూడా తెలిసిన సంగతే. ఇదిలా ఉంటే కొందరు సెలబ్రెటీలు అక్రమంగా నిర్మించిన కట్టడాల మీద కూడా హైడ్రా దృష్టిసారించినట్లు తెలుస్తోంది. అందులో అక్కినేని నాగార్జుకు చెందిన ఎన్ కన్వెన్షన్‌ సెంటర్‌ కూడా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ కన్వెన్షన్ సెంటర్ మీద ఎప్పట్నుంచో వివాదాలున్నాయి. తమ్మిడి చెరువులో 3 ఎకరాల 30 గుంటలను ఆక్రమించి ఎన్ కన్వెన్షన్ సెంటర్‌ను నిర్మించారని హైడ్రాకు ఎప్పటి నుంచో ఫిర్యాదులు వస్తున్నాయి. ఎన్ కన్వెన్షన్ సెంటర్‌ను కూల్చివేయాలని హైడ్రా కమిషనర్‌కు జనం కోసం అనే సంస్థ ఫిర్యాదు చేసింది. గతంలోనే దీనిపై చర్యలకు ఉపక్రమించారని.. కానీ మధ్యలో ఆపేశారని.. ఇప్పుడు దీని మీద దృష్టిసారించాలని డిమాండ్‌ చేస్తోంది. ఇది అక్రమ కట్టడం అనడానికి రుజువులు కూడా చూపిస్తోంది జనం కోసం సంస్థ. నాగార్జున గతంలో ప్రభుత్వ అధినేతలకు సన్నిహితంగా మెలగడం ద్వారా కన్వెన్షన్ సెంటర్‌కు ఇబ్బంది రాకుండా చూసుకున్నారని ఈ సంస్థ ఆరోపిస్తోంది. మరి రేవంత్ రెడ్డి సర్కారు ఒక పెద్ద సెలబ్రెటీకి చెందిన కన్వెన్షన్ సెంటర్‌ను కూల్చేంత సాహసం చేస్తుందా అన్నది ఇప్పుడు ప్రశ్న.

పూర్తిగా చదవండి..