విజయవాడ: ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వైసీపీకి వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. తాజాగా, విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో వైసీపీ కార్పొరేటర్లు ముగ్గురు టీడీపీలో చేరారు. ఎంపీ కేశినేని శివనాధ్ (చిన్ని) సమక్షంలో మైలవరపు మాధురి లావణ్య, మైలవరపు రత్నకుమారి, హర్షద్ టీడీపీ కండువా కప్పుకున్నారు.

Also Read: కంపెనీల్లో ప్రాణాలకు విలువ లేని పరిస్థితి.. పవన్ కళ్యాణ్ ఆవేదన!

ఈ సందర్భంగా కేశినేని చిన్ని మాట్లాడుతూ.. బెజవాడలో చాలా మంది కార్పొరేటర్లు టీడీపీలో చేరటానికి సిద్దంగా ఉన్నారన్నారు. నగర అభివృద్ధి కోసం స్వ‌చ్భందంగా ముందుకు వచ్చే వారికే స్వాగ‌తం ప‌లుకుతామన్నారు. విజ‌య‌వాడ‌లో 2014 నుంచి 2019 వరకు జరిగిన అభివృద్ధి మళ్ళీ ఇపుడు కొనసాగిస్తామని తెలిపారు. ఎన్డీయే కూట‌మి బెజ‌వాడ‌లో ప్ర‌తిప‌క్ష పార్టీల నామ రూపాలు లేకుండా చేస్తుందన్నారు. తెలుగుదేశం పార్టీని విజ‌య‌వాడ‌కు కంచుకోట‌గా మార్చి చూపిస్తామని అన్నారు.

Also Read: కన్నీరు పెట్టిస్తోన్న హారిక కథ.. చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయి..!

ఈ క్రమంలోనే చంద్రబాబుకు కుటుంబం కంటే రాష్ట్రమే ముఖ్యమన్నారు మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్. రాష్ట్ర అభివృద్ధి కోసం చంద్రబాబు చేస్తున్న కృషిని అందరూ అభినందించాలన్నారు. విజయవాడలో వైసీపీ మొత్తం ఖాళీ అవుతుందని.. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ త్వరలోనే టీడీపీ కైవసం చేసుకుంటుందన్నారు. జగన్ ఐదేళ్లగా విజయవాడ నగర అభివృద్ధిని పట్టించుకోలేదని.. చంద్రబాబు ఆధ్వర్యంలో విజయవాడ నగరం అభివృద్ధి పథంలో దూసుకుపోతుందని అన్నారు.

 

The post AP: వైసీపీకి బిగ్ షాక్.. టీడీపీలో చేరిన ముగ్గురు కార్పొరేటర్లు! appeared first on Rtvlive.com.