చిరంజీవి: ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు నివాసంలో పద్మభూషణ్ డాక్టర్ చిరంజీవి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. తిరుపతి లోని ఎమ్మెల్యే నివాసంకు చేరుకున్న చిరంజీవి దంపతులకు అభిమానులు, ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు ఘన స్వాగతం పలికారు.
Also Read: ఆపద్బాంధవుడు అన్నయ్య.. చిరంజీవికి పవన్ బర్త్ డే విషెస్
అనంతరం ఎమ్మెల్యే కోరిక మేరకు మెగాస్టార్ చిరు కేక్ కట్ చేసి సతీమణి సురేఖకు, ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులకు తినిపించారు. ఈ వేడుకల్లో శ్రీమతి సురేఖతో పాటు ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. అనంతరం తేనీటి విందు చేసిన చిరంజీవి అభిమానులతో ఫోటో దిగారు. తధానంతరం చిరంజీవి హైదరాబాద్ బయలుదేరి వెళ్ళారు.